దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం టమాటాల ధర అమాంతం పెరిగిపోయింది. నిన్నటి వరకు కిలో రూ.20 నుంచు రూ. 30 వరకు ఉంటె ఒక్కసారిగా టమాటా ధర రూ.80-120 వరకు పెరిగిపోయింది. ఈ రేటును చూసి సామాన్యులు భయపడుతున్నారు. మనం ఏ కూరలు చేసిన గ్రేవీ కోసం టమాటాలను ఎక్కువ వాడుతుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టమాటాలను కొనాలన్నా కూడా కష్టమే. వాటికి బదులుగా వీటిని వాడండి. అవేంటో ఇక్కడ చూద్దాం..
చింతపండు
టమాటాలకు బదులుగా చింతపండు, చింతపండు గుజ్జు వాడినా కూర మంచి రుచిగా ఉంటుంది.
వినిగార్
వినిగార్ ఇది వంటలకు పుల్లని, ఘాటైన రుచిని ఇస్తుంది. టమాటాల వాడకాన్ని తగ్గించుకోవడానికి.. వంటల్లో వెనిగర్‌ను వాడితే కూరలు టేస్టీగా ఉంటాయి.
ఉసిరి పొడి
ఉసిరి పొడి పుల్లగా ఉంటుంది. ఇది కూరలకు రుచిని ఇవ్వడంతో పాటు.. పులుపుదనాన్నిస్తాయి. కూరకు పులుపు టేస్ట్ రావాలంటే.. ఈ పొడిని చిటికెడు వేస్తే చాలు.
Read More: టమాట ధరలు ఎప్పుడు తగ్గనున్నాయో తెలుసా?