పీనిస్‌లో చిక్కుకున్న యూఎస్‌బీ కేబుల్.. ప్రైవేట్ పార్ట్స్ కొలుస్తుండగా

యూకేకు చెందిన ఒక టీనేజర్ పురుషాంగం లోపల USB కేబుల్ ఇరుక్కుపోయింది.

Update: 2022-09-07 13:43 GMT

దిశ, ఫీచర్స్ : యూకేకు చెందిన ఒక టీనేజర్ పురుషాంగం లోపల USB కేబుల్ ఇరుక్కుపోయింది. ఈ 15 ఏళ్ల బాలుడు తన జననాంగాల లోపలి భాగాన్ని ఒక కేబుల్ సాయంతో విచిత్రమైన 'లైంగిక ప్రయోగం' ద్వారా కొలిచేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కేబుల్ లోపల చిక్కుపడి పోవడంతో బయటకు తీయడం కష్టమైంది. దీంతో సదరు యువకుడి మూత్రంలో రక్తస్రావం తలెత్తడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ వింత సంఘటన గురించి సదరు బాలుడిని విచారిస్తే.. ఉద్దేశపూర్వకంగానే కేబుల్‌ను చొప్పించుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఇక తనకు ఎలాంటి మానసిక రుగ్మతలు లేకపోగా కౌమారదశలో ఆరోగ్యవంతుడిగానే ఉన్నాడు. అయితే ఈ కేబుల్ చాలాచోట్ల ముడిపడినందున మెటల్ రాడ్‌తో బయటికి తీయలేకపోయిన వైద్యులు బాలుడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ మేరకు వైద్య నిపుణులు బాలుడి జననాంగాలు, మలద్వారం మధ్య కోతపెట్టి కేబుల్‌ను యాక్సెస్ చేసేందుకు వీలుగా క్యాథెటర్స్ అమర్చారు. మొత్తానికి శస్త్ర చికిత్స ద్వారా వైర్ యొక్క రెండు చివరలు బాహ్య మూత్ర నాళం ద్వారా విజయవంతంగా బయటకు తీయబడ్డాయి.

ప్రస్తుతం కోలుకున్న యువకుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మూత్రనాళంలోకి ఇలాంటి వస్తువులను చొప్పించడం వల్ల మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, బాధాకరమైన అంగస్తంభనలు, మూత్రం నిలుపుదల వంటి దీర్ఘకాలిక నష్టాలు కలిగే అవకాశమున్నందున మరికొన్ని రోజులు అతడిని పర్యవేక్షిస్తామని వైద్యులు తెలిపారు. లైంగిక ప్రయోగాలు, అంతర్లీన మానసిక రుగ్మతలు.. ఇలా మూత్రనాళం, మూత్రాశయంలో వస్తువులు చొప్పించుకునేందుకు ప్రధాన కారణాలని వెల్లడించారు.

మార్నింగ్ సెక్స్‌తో త్వరగా పిల్లలు పుట్టే చాన్స్ 

Tags:    

Similar News