Unhealthy Sings : ఉదయం నిద్రలేవగానే మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బీ కేర్ ఫుల్!
ఉదయం నిద్రలేవగానే మీ మూడ్ ఎలా ఉంటుందనే దానిని బట్టి కూడా ఆ రోజు మీరు చేయాల్సిన పనులు ప్రభావితం అవుతుంటాయని నిపుణులు చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్ : ఉదయం నిద్రలేవగానే మీ మూడ్ ఎలా ఉంటుందనే దానిని బట్టి కూడా ఆ రోజు మీరు చేయాల్సిన పనులు ప్రభావితం అవుతుంటాయని నిపుణులు చెప్తుంటారు. మానసిక స్థితి బాగుంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వర్క్‌లోనూ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అలాగే కొన్ని శారీరక లక్షణాలు కూడా పలు రకాలుగా ప్రభావితం చేస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే చివరకు అనారోగ్యాలకు దారితీయవచ్చు. అలాగే కొన్ని రకాల లోపాలు, వ్యాధులవల్ల కూడా అవి సంభవిస్తూ ఉండవచ్చు. కాబట్టి కొన్ని రకాల మానసిక, శారీరక సంకేతాలు లేదా లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
* సాధారణంగా ఉదయం పూట నిద్రలేచినప్పుడు యాక్టివ్‌గా ఉంటాం. మైండ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కొందరికి మగతగా అనిపించడం, ఏమీ తోచకపోవడం, మానసిక స్థితి సరిగ్గా లేపోవడం వంటివి జరుగుతుంటాయి. తరచుగా ఇదే కొనసాగితే ప్రమాదకరమైన సంకేతంగా భావించాలని నిపుణులు చెప్తున్నారు. క్రమంగా అది నిద్రలేమి, డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది. అయితే శరీరంలో విటమిన్ డి 3 లోపం, హార్మోన్ల అసమతుల్యతవల్ల కూడా ఇలా జరగవచ్చు. కాబట్టి మీలో ఉదయంపూట ఏమీ తోచని పరిస్థితి కనిపిస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.
* మార్నింగ్ పూట లేవగానే కొందరికి తలనొప్పి వస్తూ ఉంటుంది. ప్రతీ దానికి తీవ్రంగా స్పందిస్తుంటారు. ఇవన్నీ ఒత్తిడి కారణంగా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు సైనస్ ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు వల్ల కూడా ఇలా జరగవచ్చు. అలాగే ఒళ్లు నొప్పులు వేధిస్తుంటే గనుక అవి పోషకాల లోపం వల్ల అయి ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఫైబ్రోమైల్జియాకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* మార్నింగ్ పూట మీకు నోటిలో లాలాజలం ద్రవం మాదిరి ఎక్కువగా కారడం, ఆహారం తిన్నప్పుడు రుచిగా అనిపించకపోవడం వంటి సంకేతాలు కనిపిస్తే అవి కూడా సైనస్ ఇన్‌ఫెక్షన్లు లేదా ఐరన్, కాల్షియం లోపంవల్ల కూడా జరగవచ్చు.. కాబట్టి లక్షణాలు గుర్తించి అలర్ట్ అవ్వాలంటున్నారు వైద్య నిపుణులు.
* కళ్లు పొడిబారడం, మసకబారడం, లాగడం వంటివి కనిపిస్తే వివిధ కంటి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు అయి ఉండవచ్చు. మరి కొందరిలో కళ్లు తిరగడం కూడా సంభవించవచ్చు. ఇది డీహైడ్రేషన్, లోబీపీ, విటమిన్ బి12 లోపించడం, అడ్రనలిన్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడంవల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం ఈ సమస్యను ఫేస్ చేస్తుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.