'అన్‌బాక్సింగ్ బ్రైడ్'.. టిక్‌టాక్‌లో న్యూ ట్రెండ్!

Update: 2022-01-24 07:57 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొత్త వస్తువులను ఓపెన్ చేస్తూ 'అన్‌బాక్సింగ్' వీడియోలు రూపొందిస్తుంటారు. ఆ వస్తువుకు సంబంధించిన ఫీచర్స్, ఉపయోగాలు, ఎలా వాడాలి, అందులోని లాభనష్టాలు వంటివన్నీ వివరిస్తారు. అయితే దీన్నుంచి కొత్తగా 'అన్‌బాక్సింగ్ బ్రైడ్' లేదా 'అన్‌బాక్సింగ్ బై హజ్బెండ్' అనే ట్రెండ్ పుట్టుకొచ్చింది. దీని ద్వారా ఆయా జంటలు ముఖ్యంగా నూతన వధూవరులైన ముస్లిం జంటలు తమ ఐడెంటిటీని రివీల్ చేసి, చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు ప్రకటిస్తారు. అయితే ఇది మత పెద్దలతో సహా సమాజంలోని కొన్ని వర్గాలకు నచ్చకపోవడంతో, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రేమ సంజ్ఞలపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వైరల్ టిక్‌టాక్ 'అన్‌బాక్సింగ్ బ్రైడ్' ట్రెండ్ ఈ నెల ప్రారంభంలో ఉద్భవించగా, ఇందులో భాగంగా హిజాబ్‌ ధరించిన చాలా మంది మహిళలు (ఎక్కువగా ముస్లిం నూతన వధూవరులు) తమ పెళ్లి రాత్రి అద్దం ముందు పెళ్లి దుస్తుల్లో నిలబడతారు. ఆ తర్వాత, వరుడు ఆమె తలపై ఉన్న ఉపకరణాలను తొలగిస్తాడు. తాము చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారని ప్రకటించేందుకు ఇదొక మార్గంగా వినియోగించుకుంటున్నారు. కానీ అది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం అనే కారణంతో భర్తలువధువులను 'అన్‌బాక్స్' చేయడాన్ని అందరూ అంగీకరించడం లేదు. ఈ మేరకు పెరాక్ ఇస్లామిక్ మత శాఖ ముస్లింలు ఈ ధోరణికి దూరంగా ఉండాలని సూచించింది, భర్తలు తమ భార్యల గౌరవాన్ని కాపాడటం తప్పనిసరి అని పేర్కొంది.

మలేషియాలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇటువంటి పద్ధతులను అనుసరించకుండా నిరోధించడానికి, పెరాక్ రాష్ట్ర మత విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. పాపిష్టిగా ఉండటం, అపవాదులను ఆహ్వానించడం ద్వారా ఇస్లామిక్ బోధనలకు వ్యతిరేకంగా ఈ ధోరణి ఉందని, దంపతులు దీనికి దూరంగా ఉండాలని పేర్కొంది. పలువురు మత పెద్దలు కూడా ఈ వీడియోలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి తన వధువు ఉపకరణాలను తీసివేయడం వంటి చర్యలను చిత్రీకరించడమంటే "భార్యను అమ్మడం" లాంటిదే అని ముఫ్తీ డాక్టర్ మొహమ్మద్ అస్రీ జైనుల్ అబిదీన్ అభిప్రాయపడ్డాడు.


'ఇలాంటి వీడియోలను రికార్డ్ చేయడానికి మీకు సిగ్గు లేదా? భార్య యొక్క ఔరా‌త్‌ను ఆమె భర్త చూసుకోవాలి. సన్నిహిత భాగాలను బహిర్గతం చేయడం హరామ్' 'ఈ రోజుల్లో యువ నూతన వధూవరులు ట్రెండ్‌ల కోసం అనుచితమైన ధోరణులకు సులభంగా ప్రభావితమవుతారు, కానీ వాస్తవానికి, ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది' 'ఈ చర్య ఇస్లామిక్ బోధనలో భాగం కాదు ఎందుకంటే ఇది పాపానికి నాంది, అపవాదును ఆహ్వానిస్తుంది' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాశ్చాత్య ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని చాలా మంది పేర్కొనగా.. మారుతున్న విలువలు, ఆలోచనా విధానాలు ప్రజలు చూసే విధానాన్ని మార్చాయని అంటున్నారు. అర్ధంలేని వాటిలో పాల్గొనవద్దని, అది ఎటువంటి ప్రయోజనాలను తీసుకురాదని సామాజిక వాదులు భావిస్తున్నారు.

'భర్తలు తమ కుటుంబ సభ్యులను అల్లా ఆగ్రహానికి గురిచేసే చర్యల నుండి రక్షించాలి మరియు సంరక్షించాలి, అలాగే అల్లాకు లోబడాలి. అనైతిక సంస్కృతి మరియు ఇస్లాం బోధనలకు విరుద్ధమైన వాటిని వదిలివేయండి' అని మలేషియాలోని ఫెడరల్ టెరిటరీస్ ఇస్లామిక్ రిలిజియస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

Tags:    

Similar News