Diabetes : మందులే అవసరం లేదు.. ఇలా చేసినా డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది!

Diabetes : మందులే అవసరం లేదు.. ఇలా చేసినా డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది!

Update: 2024-11-27 07:55 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒక్కసారి శరీరంలో డెవలప్ అయిందంటే జీవితాంతం ఉంటుంది. కంట్రోల్లో ఉంచుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం రెగ్యులర్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే మెడిసిన్ వాడకపోయినా ‘లో కార్బ్ డైట్’ మెయింటైన్ చేస్తే టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని బర్మింగ్ హోమ్‌లోని అలబామా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నప్పుడు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ పెరుగుతుంటాయి. వీటిని అదుపులో ఉంచడానికి బాధితులు సహజంగానే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవసరం లేకుండా ఆహారంలో మార్పులు చేసుకుంటే కూడా ఈ డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా లో కార్బ్ డైట్ తీసుకుంటే ఈ డయాబెటిస్ బాధితుల్లో శరీరంలో ‘బీటా సెల్’ పనితీరులో గణనీయమైన మార్పులు వస్తాయని, తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుందని రీసెర్చర్స్ గుర్తించారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 35 నుంచి 65 ఏండ్లలోపు వయస్సు గల అనేక మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో లో కార్బ్ డైట్ (Low carb diet) ఎక్కువకాలం మెయింటైన్ చేసిన వారి ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడంవల్ల, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పాస్తా, వైట్ బ్రెడ్, షుగరింగ్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటివి అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. బదులుగా ఆకు కూరలు, బ్రోకలీ, నట్స్, తాజా కూరగాయలు వంటి ఫైబర్ పుష్కలంగా ఉండే లో కార్బ్ ఫుడ్స్ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే చేపలు, గుడ్లు, మాంసం, హెల్తీ ఫ్యాట్స్ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు కూడా మేలు చేస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News