ఇద్ద‌రికీ ఒకే భ‌ర్త కావాలంటున్న స్నేహితురాళ్లు! నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్‌

పెళ్లైన త‌ర్వాత కూడా ఒకే చోట క‌లిసి ఉండాల‌ని నిశ్చ‌యించుకున్నారు. Two Malaysian friends Want to marry one man.

Update: 2022-03-26 10:18 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలో ఎన్నో జాతులు, మ‌రెన్నో సంస్కృతులు, ఇంకెన్నో ఆచార‌వ్య‌వ‌హారాలు.. వేల‌ యుగాల నాటి మాన‌వ చ‌రిత్ర‌లో అంద‌రం సంక‌ర‌మే అయినప్ప‌టికీ ఆయా దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో స్థానిక‌ సంస్కృతులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం చాలా దేశాల్లో సామాజికంగా ఏకభార్యత్వం పాటిస్తున్న‌ప్ప‌టికీ, కొంతమంది బ‌హుభార్య‌త్వం, బ‌హుభ‌ర్త‌త్వం ఆచరిస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో మ‌లేషియాలో ఈ బ‌హుభాగ‌స్వాముల ఆచారాన్ని ఇద్ద‌రు అమ్మాయిలు తెలివిగా వినియోగించుకోవాల‌న‌కుంటున్నారు. ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులు కావ‌డంతో పెళ్లైన త‌ర్వాత కూడా ఒకే చోట క‌లిసి ఉండాల‌ని నిశ్చ‌యించుకున్నారు. దాని కోసం ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలనే ఆశతో ఫేస్‌బుక్‌లో త‌మ కోరిక‌ను వెల్ల‌డించారు. ఒకే అబ్బాయిని "సాధారణ వివాహాం" చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం, సింగిల్ మ‌ద‌ర్‌గా ఉంటూ స్వ‌యం ఉపాధి పొందుతున్న 31 ఏళ్ల నార్ ఫాతిమా అజాహ్రా, ఓ లాండ్రీ యజమాని అయిన 27 ఏళ్ల ఫాతిన్ అక్మా ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. వీరిద్దరూ ఇటీవల మలేషియాకు చెందిన ఫేస్‌బుక్ పేజీ వైరల్ సెన్సాసిలో "కామన్ మ్యారేజ్ ప్రపోజల్" పోస్ట్‌ను పోస్ట్ చేశారు. తమ ఇద్దరినీ ఒకేసారి వివాహం చేసుకోగల భాగస్వామి కావాల‌ని అందులో ప్ర‌క‌టించారు. పోస్ట్ చివరలో, ఎవరైనా తమ షేర్డ్‌ "జీవిత భాగస్వామి" ప్రమాణాలను సంతృప్తి పరచలేకపోతే, వారు 2-ఆన్-2 ఏర్పాటులో కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇక‌, ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లో బహిర్గతం అయిన కొద్దిసేపటికే, దాదాపు 7,400 కామెంట్‌లు, 1,800కి పైగా షేర్‌లు వచ్చాయి. దీనితో పెద్ద సంఖ్యలో నెటిజన్లు దీనిపై చర్చించుకుంటున్నారు. మరోవైపు, మెజారిటీ ప్రతిస్పందనలు ప్రతికూలంగా ఉన్నాయి. చాలా మంది ఫాతిమా, ఫాతింగ్‌ చర్యలను ముస్లిం మహిళలను కించపరిచేలా ఉన్నాయ‌నీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇతర నెటిజన్లు వారి ఆలోచ‌న‌ల‌ను ఆమోదించారు. 

Tags:    

Similar News