Tulasi Tea: పరగడుపున ఈ ఆకులతో టీ తాగితే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!
టీలో కొన్ని ఆకులను చేర్చడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
దిశ, వెబ్ డెస్క్: టీలో కొన్ని ఆకులను చేర్చడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే టీలో ఈ ఆకులను వేయడం వలన ఫ్లూ, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ ఆకులు మీ రోగనిరోధక శక్తిని పెంచి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. వాటిలో మనం తులసి ఆకుల టీ ని ఎక్కువగా తీసుకుంటున్నాం. దాని వల్ల మనకి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
తులసి ఆకుల టీ:
తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకులను టీలో కలపడం వల్ల దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. అంతే కాకుండా కఫంతో బాధ పడే వారికి ఇవి సహాయపడతాయి.
Read more: