Orange Peel Face Pack: ఈ తొక్కతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. ముఖం మెరిసిపోతుందంతే!

అమ్మాయిలు అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

Update: 2024-09-25 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలు అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చిన్న పింపుల్ కాగానే ఎలా తగ్గిపోతుందిరా నాయన అంటూ తెగ ఆందోళన చెందుతారు. కాగా చర్మం పూర్తి ఆరోగ్యానికి అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం నారింజ తొక్కతో ఓసారి ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. రిఫ్రెష్ రుచి, ఆకట్టుకునే ఆరోగ్య ప్రయోజనాలకు మీ సొంతమవుతాయి.

నారింజలోని పోషకాలు..

నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నారింజ పండు హెల్త్‌కు ఎంత మంచిదో చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. అయితే చాలా మంది ఆరెంజ్ తొక్కలను పాడేస్తుంటారు. కానీ ఈ నారింజ తొక్కలతో రెట్టింపు అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. దీనిలో ఉండే సహజ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఫేస్ పై మచ్చల్ని తొలగించడంలో తోడ్పడుతుంది. పింపుల్స్ తగ్గుతాయి. వృద్ధాప్య సమస్యలు దూరమవుతాయి.

నారింజ తొక్కలతో పొడి తయారీ విధానం..

నారింజ తొక్కలను పొడి రూపంలో యూజ్ చేయాలి. ఫస్ట్ నారింజ తొక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకుని అందులో గులాబీ వేసి మిక్స్ పట్టాలి. తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందంగా మెరిసిపోతారు. మొటిమలకు, మచ్చలకు చెక్ పెట్టొచ్చు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News