Trending : మనం ఎక్కువగా OK పదం ఎందుకు వాడుతుంటాం?.. రియల్ మీనింగ్ తెలుసా?

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం OK అనే పదాన్ని వాడకుండా దాదాపుగా ఉండలేం. ఇతరులతో నేరుగా మాట్లాతున్నా, ఫోన్‌లో ఛాటింగ్ చేస్తున్నా దీనిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం.

Update: 2024-08-25 06:07 GMT

దిశ, ఫీచర్స్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం OK అనే పదాన్ని వాడకుండా దాదాపుగా ఉండలేం. ఇతరులతో నేరుగా మాట్లాతున్నా, ఫోన్‌లో ఛాటింగ్ చేస్తున్నా దీనిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. వాస్తవానికి అంగీకారాన్ని తెలిపేందుకు వాడుతుంటాం. అంటే తెలుగులో ‘సరే’ అనే పదానికి బదులుగా ఇంగ్లీషులో OK అనేస్తుంటాం. అసలు ఇలా ఎందుకు అనాలి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? దీని రియల్ మీనింగ్ ఏంటో తెలుసా?

ఆంగ్ల భాషా నిపుణుల ప్రకారం.. ఓకే అనే పదానికి పురాతన కాలంలో ‘తప్పు’ అని సూచించడానికి, తప్పును సరిచేయడానికి వాడేవారట. కానీ భాషా పరిణామ క్రమంలో ప్రజలు దాని అర్థాన్నే మార్చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంటే రాను రాను ఆల్ కరెక్ట్ (AC) అనే పదానికి ప్రత్యామ్నాయంగా ఓకే పదాన్ని దుర్వినియోగం చేసినట్లు చెప్తున్నారు.

పూర్వాపరాలు పరిశీలిస్తే 182 ఏండ్ల క్రితం నాటి అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ గోర్డాన్ గ్రీన్ ఫస్ట్ టైమ్ ఈ ఓకే పదాన్ని యూజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 1839లో పలువురు రచయితలు కూడా ఇంగ్లీషులో వివిధ పదాలను షార్ట్‌కట్‌లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారని నిపుణులు అంటున్నారు. మరో విషయం ఏంటంటే.. OK అంటే గ్రీకు భాషలో ‘ఆల్ ఈజ్ వెల్’ అని అర్థం. దీనినే మనం క్రమంగా ఓకే అనేయడం మనకు అలవాటైపోయిందని కూడా నిపుణులు చెప్తున్నారు.

మరొక వాదన ప్రకారం.. Ok పదం అమెరికాలోని చోక్టాన్ తెగ ప్రజలు యూజ్ చేసే ‘Okeh’ పదం నుంచి వచ్చింది. Huff Post అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా ఇదే పేర్కొంటున్నది. ఏది ఏమైనా ఒకప్పుడు Ok అనే దానికి రెండు మూడు రకాల అర్థాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ప్రతిరోజూ ఉపయోగించే ఫేమస్ వర్డ్ OK. గతంలో ఏం జరిగినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరూ దీనిని ‘సరే’ అనే అర్థంలోనే యూజ్ చేయడం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు. 

Tags:    

Similar News