ఈ రోజు ప్రత్యేకత: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం
1980 సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం..Latest Telugu News
దిశ, ఫీచర్స్: 1980 సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. కాగా ప్రపంచ పర్యాటక సంస్థ, ఐ.రా.స.. 1980 సెప్టెంబరు 27నుంచి ఈ వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాయి. UNWTO విధానాలను అనుసరించి 1970లో ఈ రోజును మొదటిసారి ప్రకటించినప్పటికీ 1980లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇక 1997 అక్టోబరులో ఇస్తాంబుల్, టర్కీలో జరిగిన UNWTO సర్వ ప్రతినిధి సభ పన్నెండో సమావేశంలో ప్రతి ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో సంస్థ భాగస్వామిగా వ్యవహరించేందుకు ఒక ఆతిథేయ దేశాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రత్యేక రోజున అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్రపై అవగాహన పెంచడం సహా వరల్డ్ వైడ్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను పర్యాటకం ఎలా ప్రభావితం చేస్తుందో వివరించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.