Time Management : టైమ్ ఈజ్ ఇంపార్టెంట్.. ఎప్పుడేం చేయాలో తెలుసుకోవడమే ముఖ్యం!

Time Management : టైమ్ ఈజ్ ఇంపార్టెంట్.. ఎప్పుడేం చేయాలో తెలుసుకోవడమే ముఖ్యం!

Update: 2024-11-15 09:52 GMT

దిశ, ఫీచర్స్ : అతి ఆలోచనలు వేధిస్తున్నాయా? అనుకున్నది సాధించలేక అవస్థలు పడుతున్నారా?, లక్ష్యం చేరే మార్గం తెలియడం లేదా? ఆందోళనలో కూరుకుపోయా? అయితే మీ సమయ నిర్వహణలో లోపం కూడా ఉండి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నేటి డిజిటల్ యుగంలో, ఆధునిక పోటీ ప్రపంచంలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్‌ను ప్రభావితం చేసే పవర్ ఫుల్ వెపన్ టైమ్ మేనేజ్‌మెంట్‌. దాని నిర్వహణ సక్రమంగా లేనప్పుడూ అన్నీ ప్రతికూలతే కలనిపిస్తాయి మరి!

కెరీర్‌లోనే కాదు, ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్‌లో‌నూ టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం అంటున్నారు నిపుణులు. అది మీ క్రమశిక్షణకు, నిబద్ధతకు కూడా నిదర్శనం. సమయం పాటించడం, సమర్థవంతంగా మేనేజ్ చేయడం నేర్చుకుంటే మీరు ఏ రంగంలో ఉన్నా సక్సెస్ వైపు దూసుకెళ్తారు. అందుకే ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం టైమ్ మేనే‌మెంట్. అది మీరు ఫాలో అయినప్పుడు అనుకున్నది సాధించడంలో సఫలం అయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే అనుకున్న పనులను సమయానికి చేయడం, చేరుకోవాల్సిన చోటకు సమయానికి చేరుకోవడం వంటివి చాలా ముఖ్యం.

ఎప్పుడేం చేయాలో లిస్ట్ చేయండి

ఉద్యోగం చేస్తున్నా, ఉన్నత చదువులు చదువుతున్నా, వ్యాపారంలో బిజీగా ఉన్నా మీకు ఎల్లప్పుడూ సహకరించేది టైమ్ మేనేజ్‌మెంట్ ఒక్కటే. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి? ఏ పని ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలి? ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు.. ఇలా మీరున్న రంగాన్ని బట్టి, చేస్తున్న పనిని బట్టి సమయపాలన, సమయ విభజన, సమయ నిర్వహణ కలిగి ఉండాలంటున్నారు మోటివేషనల్ ఎక్స్‌పర్ట్స్.

వాయిదా వద్దు 

మీ ఎదుగుదలకే కాదు, సమయ నిర్వహణకు ఉమ్మడి శత్రువు ఏదైనా ఉందంటే అది వాయిదా వేసే పద్ధతి. మరో వారం రోజుల్లో పరీక్షలు సమీపిస్తున్నాయని తెలిసి కూడా ఒక విద్యార్థి తర్వాత చదువుదామని వాయిదా వేస్తూ పోతే నష్టపోతాడు. వన్ వీక్‌లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఇంకా టైముంది కదా అనుకుంటూ వాయిదా వేస్తే ఫైనల్‌గా కంప్లీట్ చేయకపోవచ్చు. అందుకే ఉన్న సమయాన్నే వీలైనంత ఎక్కువగా యూజ్ చేసుకోండి. రేపటికి వాయిదా వేసే బదులు ఇప్పుడే ప్రాంరంభించండి అంటున్నారు పర్సనల్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ ట్రైనర్స్.

లక్ష్యంవైపు అడుగులు

టైమ్‌ మేనేజ్‌ మెంట్‌ను పర్‌ఫెక్టుగా ఫాలో అయితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీరు సెట్ చేసుకున్న గోల్స్‌ను సమర్థవంతంగా అధిగమించడంలో అది సహాయపడుతుంది. ఏదైనా వాయిదా వేసే ధోరణికి స్వస్తి పలుకుతారు. మీలో మానసిక ఒత్తిడికి దారితీసే అలవాట్లు తగ్గిపోతాయి. ఇలా అన్నీ టైమ్ ప్రకారం చేస్తూ పోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. పర్సనల్ అండ్ ఫ్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడంలో మీకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎప్పటి పనులు అప్పుడు పూర్తిచేయడంవల్ల, టైమ్ ప్రకారం వ్యవహరించడం వల్ల సహజంగానే ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఏది ఎప్పుడు చేయాలో అర్థమైపోతుంది. ఇదే కదా మీలోని క్రియేటివిటీని బయటకు తీసి సక్సెస్‌కు వైపు నడిపిస్తుంది. 

Tags:    

Similar News