Cancer: గొంతు ప్రాబ్లమ్, బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్‌కు దారితీయొచ్చు.. లక్షణాలివే?
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. నాన్ స్టాప్‌గా దగ్గడం, ఊపిరి ఆడకపోవడం, వాంతులవ్వడం, మింగడంలో ఇబ్బంది పడడం, మూత్రంలో బ్లడ్ పడడం, అజీర్ణం లేదా గుండెల్లో మంట, ఆకలి లేకపోవడం, సడన్‌గా వెయిట్ లాస్ అవ్వడం, రాత్రుళ్లు ఎక్కువ చెమట పట్టడం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం, గొంతు నొప్పి పెట్టడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్ 75 శాతం పొగాకు తీసుకునే వారిలో వస్తుందని నిపుణులు గుర్తించారు. అలాగే అధిక బరువు ఉన్నవారికి, అధికంగా మద్యం తీసుకోవడం వల్ల, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కారణంగా క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు.
అయితే ఒక నెలరోజుల పాటు గొంతు నొప్పి, మాట్లాడుతుంటే బొంగురు లాగా అనిపిస్తే మాత్రం అది స్వరపేటిక క్యాన్సర్ కు దారితీయొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని.. కాగా ముందుగానే క్యాన్సర్ లక్షణాల్ని గుర్తించి వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు జనాలకు సూచిస్తున్నారు.
స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు
స్వరపేటిక క్యాన్సర్ వచ్చిన వారు తీవ్రమైన అలసటకు గురవుతారు. విపరీతంగా గొంతు నొప్పి ఏర్పడుతుంది. నాన్ స్టాప్‌గా దగ్గుతూనే ఉంటారు. మాట సరిగ్గా రాదు. బొంగురుగా వస్తుంది. మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటికి తోడుగా చెవినొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక కూడా వస్తుంది. అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఈ స్వరపేటిక క్యాన్సర్ ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలోనే వస్తుంది. అందులో ఆడవాళ్లలో కంటే పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. కాగా దీన్ని తొందరగా గుర్తిస్తే వ్యాధి నుంచి బయటపడే చాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా..? అయితే డేంజర్‌లో ఉన్నట్లే జాగ్రత్త!