Tea Side Effects: టీ అతిగా తాగేవారు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

మనలో చాలా మంది టీ ఎక్కువగా తాగుతుంటారు.

Update: 2024-11-13 10:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది టీ ఎక్కువగా తాగుతుంటారు. దీని వలన మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే, ఈ టీని అతిగా తాగడం వలన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటూ ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. కొంతమంది ఉదయాన్నే టీ కప్పులు కప్పులు తాగేస్తుంటారు. ప్రతీ రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు టీ తాగకపోవడమే మంచిదని అంటున్నారు. టీ తాగడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

టీ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు:

నిద్రలేమి:

" టీ " లో ఉండే కెఫిన్ నిద్ర వచ్చే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. రాత్రి పూట టీ తాగడం వలన నిద్ర లేమి, నిద్రలో కలలు రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

హృదయ స్పందన రేటు:

టీని రోజు మూడు కంటే ఎక్కువసార్లు తాగడం వల్ల గుండె స్పందన రేటు పెరుగుతుంది. దీని వలన రక్తపోటు కూడా వస్తుంది. అంతే కాకుండా, కొంతమందిలో ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ సమస్యలు ఉన్నవారు టీ తాగకపోవడమే ఎంతో మంచిది.

Tags:    

Similar News