ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు.. నెలసరి నొప్పులు మాయం!

ఆడవారిలో నెలసరి అనేది సాధారణమైన విషయం. కానీ, ఈ నెలసరి సమయం అందరికి ఒకేలా ఉండదు.

Update: 2024-11-22 09:53 GMT

దిశ, ఫీచర్స్: ఆడవారిలో నెలసరి అనేది సాధారణమైన విషయం. కానీ, ఈ నెలసరి సమయం అందరికి ఒకేలా ఉండదు. చాలామందికి నెలసరి సమయంలో కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి. కడుపులో విపరీతమైన నొప్పి, నడుము నొప్పి, బాడీ పెయిన్స్, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ నొప్పిని తట్టుకోవడానికి చాలామంది మెడిసిన్‌ వేసుకుంటారు. కానీ, పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు. అదే ఉత్కట కోణాసనం. దీనిని నెలసరి సమయంలో మాత్రమే కాకుండా ప్రతీ రోజు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నెలసరి నొప్పిని తగ్గిస్తుంది: ఈ ఉత్కట కోణాసనం చేయడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి ఉపశమం లభిస్తుంది. మోనోపాజ్ నుంచి వచ్చే సమస్యలు తగ్గేందుకు ఉత్కట కోణాసనం సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఈ ఆసనం వేయడం వల్ల మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆందోళన, ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అంతర్గత సామార్థాన్ని పెంచి, ఏకాగ్రతను పెంచేందుకు సహాయపడుతుంది.

పెల్విస్‌ను ఉత్తేజపరుస్తుంది: శరీరంలో ప్రత్యుత్పత్తి అవయవ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనాన్ని గర్భిణి స్త్రీలు చేయడం వల్ల ప్రసవం సులభం అవుతుంది.

కండరాలు దృఢంగా: ఈ ఆసనం ప్రతీ రోజు చేయడం వల్ల తుంటి, తొడలతో సహా శరీరంలోని కింది భాగంలో కండరాలు దృఢంగా మారుతాయి. ఇది శరీర శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రక్త ప్రసరణకు: ఈ ఉత్కట కోణాసనంను ప్రతి రోజూ చేయడం వల్ల శరీర భాగాల్లో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఉత్కట కోణాసనంను ఇలా చేయండి:

ముందుగా నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత రెండు కాళ్లను పక్కకు కొంత దూరం జరపాలి. ఆ తర్వాత మోకాళ్లను వంచి, శరీరాన్ని కిందకు తీసుకురావాలి. అలా వీలైనంత వరకు మోకాళ్లను వంచాలి. ఆ తరువాత చేతులను నమస్కరిస్తున్నట్లుగా చక్కగా పెట్టాలి. దీర్ఘశ్వాస తీసుకుంటూ వదులుతూ కాసేపు అలాగే ఉండాలి. ఇలా నాలుగు లేదా ఐదు సార్లు ఈ ఆసనంను రిపీట్ చేస్తుండాలి. 

Tags:    

Similar News