ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్.. వింటర్‌లో అస్సలు వదలకండి

చలికాలం ప్రారంభం కాగానే లభించే ఆహార పదార్థాల్లో తేగలు ఒకటి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

Update: 2024-11-22 12:26 GMT

దిశ, ఫీచర్స్: చలికాలం ప్రారంభం కాగానే లభించే ఆహార పదార్థాల్లో తేగలు ఒకటి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ తేగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. శీతాకాలంలో తప్పకుండా ఈ సూపర్ ఫుడ్‌ని తింటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. సాధారణంగా ఇవి తాటి టెంకల నుండి ఏర్పడతాయి. తాటికాయ టెంకలను మట్టిలో పాతితే, మొలక వస్తుంది. ఆ మొలకే ఈ తేగలు. వీటిని కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా రుచికరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తేగలు బ్లడ్ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో సహాయపడతాయి. వీటిని తరుచూ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో ఎక్కువగా పొటాషియం, విటమిన్- సి, బి3, బి1, బి2, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణక్రియకు మంచిది: తేగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. పెద్ద పేగుల్లో మలినాలు చేరకుండా టాక్సిన్లను తొలగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్- సి, తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఎముకలు బలంగా: తేగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా మారుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. రోధనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయి.

రక్తహీనతకు చెక్: తేగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఒంటికి రక్తం పడుతుంది. షుగర్ ఉన్న వారు వీటిని తింటే బ్లడ్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను, వాటి పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గాలని అనుకునే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని రోజువారి డైట్‌లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కొంచెం తింటేనే కడుపు నిండిపోతుంది.

మలబద్ధకం సమస్య: చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. అలాంటి వారు వీటిని తినడం వల్ల పేగుల్లో కదలికలను నియంత్రించి, కడుపును ఖాళీ చేస్తుంది. శరీరంలో జీర్ణంచుకోలేని కార్బోహైడ్రేట్లు, రక్తంలోని కొలెస్ట్రాలు, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మానికి మేలు: తేగలను పాలలో ఉడికించి, ఆ పాలను చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే, వీటిని అధికంగా తినడం మంచిది కాదని, కడుపులో నొప్పికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Honeymoon Destinations : కొత్తగా పెళ్లైందా..? మన దేశంలోని బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఇవిగో!




Tags:    

Similar News