Health Tips : ఈ ఫుడ్ కాంబినేషన్ వద్దు.. హెల్త్ రిస్క్‌లో పడవచ్చు!
Health Tips : ఈ ఫుడ్ కాంబినేషన్ వద్దు.. హెల్త్ రిస్క్‌లో పడవచ్చు!
దిశ, ఫీచర్స్ : తీసుకునే ఆహారాలను బట్టి మనం హెల్తీగా ఉంటాం. వాటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. అయితే కొన్నిసార్లు అవి సరైనవి కానప్పుడో, శరీరానికి పడనప్పుడో ‘ఫుడ్ పాయిజన్స్’ వంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతుంటాయి. అలాగే కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడంవల్ల కూడా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అంటున్నారు నిపుణులు. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ ఏవి? ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.
*షుగర్ డ్రింక్స్, పులియ బెట్టిన ఆహారాలు : సాధారణంగానే అధిక స్థాయి చక్కెరలు కలిగి ఉంటాయి. కాబట్టి షుగర్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఫెర్మెంట్ చేసినవి కొన్ని మేలు చేయవచ్చు. కానీ వీటిని షుగరింగ్ డ్రింక్స్‌తో కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
* క్యాబేజీ, బీన్స్ : వీటిలో ఉండే పోషకాల కారణంగా క్యాబేజీ, బీన్స్ కలిపి తినడం మంచిది కాదు. దీనివల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిలోని సల్ఫరో కాంపౌండ్స్ జీర్ణ సమస్యలను పెంచుతాయి.
* సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్ : తెలిసో తెలియకో కొన్నిసార్లు పలు రకాల ఫుడ్స్ కలిపేసి తింటుంటారు కొందరు. ముఖ్యంగా నిమ్మకాయ, ఆరెంజ్, ద్రాక్ష, దానిమ్మ వంటి సిట్రస్ పండ్లతో పాలు, పాలతో తయారు చేసిన ఇతర ఆహారాలను కలిపి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. ఎసిడిటీని పెంచుతాయి.
* టొమోటోలు, స్టార్చ్ ఫుడ్స్ : టొమాటో సాసెజ్‌ను కొందరు బ్రెడ్, పాస్తా వంటి వాటితో కలిపి తింటుంటారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి.
*అరటిపండ్లు, పాలు : వీటిని కలిపి తీసుకోవడంవల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తాయి. పాలల్లోని లాక్టోస్, అరటి పండ్లలోని స్ట్రాచ్స్ కలిస్తే చిన్నపాటి పాయిజన్‌గా మారి కడుపులో ఇబ్బందికి కారణం అవుతాయి.
* కొవ్వు పదార్థాలు, పచ్చి కూరగాయలు : ఫ్రై చేసిన ఆహారాలను, అలాగే సాసెజ్‌లలో ఉండే హై ఫ్యాట్ ఫుడ్స్‌ను పచ్చి కూరగాయలతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరానికి అందాల్సిన న్యూట్రెంట్స్ అందవు.
ఇలా తీసుకోవచ్చు
సిట్రస్ పండ్లను సీడ్స్, నట్స్‌తో కలిపి స్నాక్స్‌గా తీసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే బీన్స్‌ని రైస్, క్వినోవాతో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. టోస్ట్‌ను అవకాడో, ఎగ్స్‌తో కలిపి బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. టొమాటోలను చికెన్, చేపలతో కలిపి చేసే ఫుడ్ తీసుకోవచ్చు. అరటి పండ్లు, బాదం బటర్, పీనట్‌తో కలిపిన జ్యూస్ తాగవచ్చు. వీటితోపాటు ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల ఆహారాలు పడకపోవడం వంటివి శరీరతత్వం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏది మంచిదో, ఏది కాదో ఆలోచించి అందుకు తగినట్లు డైట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్.. వింటర్‌లో అస్సలు వదలకండి