Overweight : అధిక బరువుకు దారితీస్తున్న ఆ ఐదు తప్పులు.. ఎలా ప్రభావితం చేస్తాయంటే..

ఓ వైపు ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి అంశాలపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. మరోవైపు అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు పలువురిని వేధిస్తున్నాయి. దీనివల్ల నలుగురిలో కలిసి మెలిసి తిరగడానికి మొహమాట పడుతుంటారు.

Update: 2024-08-30 08:05 GMT

దిశ, ఫీచర్స్ : ఓ వైపు ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి అంశాలపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. మరోవైపు అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు పలువురిని వేధిస్తున్నాయి. దీనివల్ల నలుగురిలో కలిసి మెలిసి తిరగడానికి మొహమాట పడుతుంటారు. సొంత పనులు చేసుకోవడంలోనూ ఇబ్బుందులను ఎదుర్కొంటారు. అయితే చాలామంది చేసే కొన్ని తప్పులవల్ల ఈ ప్రాబ్లం తలెత్తుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.

* నిద్రలేమి : అధిక బరువు లేదా ఊబకాయం సమస్య పెరగడానికి గల కారణాల్లో నిద్రలేమి ఒకటి. ఎందుకంటే నాణ్యమైన నిద్రలేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది ఆకలిని, అధికంగా తినే రుగ్మతలను పెంచుతుంది. దీంతో చాలామంది ఎంత తింటున్నామనేది పరిగణనలోకి తీసుకోకుండా జంక్ ఫుడ్స్ లాగించేస్తుంటారు. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

* మానసిక ఒత్తిడి : ఉరుకుల, పరుగుల జీవితం, ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో ఇటీవల పలువురు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితి కూడా అధిక బరువు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒత్తిడివల్ల శరీరంలో కార్టిసాల్ అనే హర్మోన్‌ లెవల్ పెరుగుతుంది. దీనివల్ల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. క్రమంగా ఊబకాయానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.

* రాత్రిళ్లు స్నాక్స్ తినే అలవాటు : రాత్రి పూట ఆహారం తీసుకునే విధానం కూడా అధిక బరువు సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఫ్రై చేసిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ తినడం, మధ్య నిద్ర మేల్కొన్నప్పుడు ఫ్రిజ్‌లో ఉన్న స్నాక్స్ తీసుకొని తినడం వంటివి అధిక కొవ్వు, అధిక బరువు పెరుగుదలకు దారితీస్తాయి. జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే రాత్రిపూట పడుకోవడానికి గంట లేదా రెండు గంటల ముందే లైట్‌గా ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు.

*వ్యాయామాలు లేకపోవడం : అధిక బరువుకు కారణం అవుతున్న ప్రధాన అంశాల్లో శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒకటని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సమయానికి తిండి, సరైన నిద్రతోపాటు వ్యాయామం చాలా ముఖ్యం. అప్పుడే కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయగలుగుతారు. ఊబకాయం, అధిక బరువు అదుపులో ఉంటాయి.

* థైరాయిడ్ : అప్పుడప్పుడూ అనారోగ్యాలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంటాయి. ప్రధానంగా మహిళల్లో పీసీఓడీ, థైరాయిడ్, హార్మోన్లలో అసమతుల్యత వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. అలాగే నిద్రలేమి, ఈటింగ్ డిజార్డర్స్ కూడా మహిళల్లో ఓవర్ వెయిట్ సమస్యకు కారణం అవుతాయి. 

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News