100 ఏళ్లు జీవించడానికి ఈ ఒక్క ఆకు చాలు..!
ఎన్నో ఆయుర్వేద లక్షణాలు, ప్రోటీన్లు కలిగి ఉన్న మునగ చెట్టు ఆకులు అనేక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆయుర్వేద లక్షణాలు, ప్రోటీన్లు కలిగి ఉన్న మునగ చెట్టు ఆకులు అనేక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మునగ చెట్టుతో పోషకాహార లోపం నివారించే సత్తా ఉందని అమెరికాకు చెందిన ‘‘ద ట్రీస్ ఫర్ లైఫ్’’ అనే స్వచ్ఛంద సంస్థ చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుందని తేల్చింది. అప్పటి నుంచి వారు మునగ చెట్టును ఆరాధిస్తున్నారు. కాగా.. మునగ ఆకు ‘టీ’ తో తల్లులకు పాలు అధికంగా పడ్డాయని కూడా వెల్లడయ్యింది. దీంతో మునగాకు పొడిని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంజీవనిగా గుర్తించబడిన మునగ ఆకు తినడం వల్ల 100 ఏళ్లు బతకొచ్చని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ చెట్టు ప్రాముఖ్యతను ప్రోత్సహించింది.
ఇప్పుడు దీని బెరడు కూడా వాడుతున్నారు. రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. గాయాలపై మునగాకు పేస్టు రాస్తే తొందరగా తగ్గుతాయి. అలాగే ఈ ఆకును వేడి చేసి అన్నంలో కలిపి తింటే ఐరన్, రక్తం పెరుగుతుంది. ఇందులో బీటాకెరోటిన్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల ఎండిన ఆకుల్లో పాలకన్నా 17 రెట్లు కాల్షియం అధికంగా ఉంటుందట. దీన్ని పప్పులో వేసి వండితే కూర ఎంతో టెస్టీగా ఉంటుంది. మునగాకు పొడిని కూడా అన్ని కూరల్లో వాడితే మంచి ప్రొటీన్లు అందుతాయి. 300 రకాల వ్యాధులను నియంత్రించగల సత్తా మునగాకులో ఉంటుంది. అలాగే మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది.