ఫ్రూట్స్‌పై పెస్టిసైడ్స్ పసిగట్టే నానో సెన్సార్.. క్షణాల్లో రిజల్ట్
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు పండ్లపై పురుగుమందుల వాడకాన్ని నిమిషాల వ్యవధిలో గుర్తించగల చిన్న నానో సెన్సార్స్‌ను అభివృద్ధి చేశారు.
దిశ, ఫీచర్స్ : స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు పండ్లపై పురుగుమందుల వాడకాన్ని నిమిషాల వ్యవధిలో గుర్తించగల చిన్న నానో సెన్సార్స్‌ను అభివృద్ధి చేశారు. కెమికల్ సిగ్నల్స్‌ను పెంచేందుకు ఇది సిల్వర్‌తో తయారు చేసిన ఫ్లేమ్-స్ర్పేయిడ్ నానోపార్టికల్స్‌ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాసెస్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, ఆహారం తీసుకునే ముందు పురుగుమందులను వెలికితీసేందుకు సాయపడగలదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
ఈ నానో-సెన్సార్స్ 1970ల నాటి ఆవిష్కరణ 'సర్ఫేస్ ఎన్‌హాన్స్‌డ్ రామన్ స్కాటరింగ్(SERS)'ను ఉపయోగించాయి. ఇది లోహ ఉపరితలాలపై జీవఅణువుల నిర్ధారణ సంకేతాలను 1 మిలియన్ రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్దిష్ట అప్లికేషన్ కోసం పరిశోధకులు ఫ్లేమ్ స్ప్రే సాంకేతికను ఉపయోగించి SERS నానోసెన్సర్‌ను అభివృద్ధి చేశారు. గాజు ఉపరితలంపై సిల్వర్ నానోపార్టికల్స్ చిన్న బిందువుల డెలివరీకి లోహపు పూత పూసేందుకు ప్రసిద్ధి చెందిన ఈ సాంకేతికత పెద్ద ప్రాంతాల్లో ఏకరీతిన SERS ఫిల్మ్ ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తుంది. స్కేలబిలిటీకి అడ్డంకులు తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో సున్నితత్వాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు ఇండివిడ్యువల్ సిల్వర్ నానోపార్టికల్స్ మధ్య దూరాన్ని సర్దుబాటు చేశారు.
ఇక తక్కువ సాంద్రతలు గల టాక్సిక్ పెస్టిసైడ్ పారాథియాన్-ఇథైల్‌ను గుర్తించేందుకు సెన్సార్లను కాలిబ్రేట్ చేయడం ద్వారా పరీక్షించిన సైంటిస్టులు.. దానిలో కొంత మొత్తాన్ని ఆపిల్‌లోని ఒక భాగంలో ఉంచారు. అవశేషాలను కాటన్ ముక్కతో సేకరించి, పురుగుమందుల అణువులను కరిగించేందుకు ఒక ద్రావణంలో ముంచారు. అప్పుడు సెన్సార్‌లోని ద్రావణ స్థాయి పడిపోయింది. ఈ విధంగా పురుగుమందు ఉనికి ఖచ్చితంగా గుర్తించబడింది.