ఆరేళ్లుగా ఉద్యోగానికే పోలేదు.. కానీ అవార్డు విన్నర్ ఆయనే..

వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కోసం నిపుణులు చాలా టిప్స్ చెప్తుంటారు. వాటిని ఆచరిస్తూ ఎంతో కొంత ఫలితం పొందుతుంటాం. కానీ స్పెయిన్ లో ఓ వ్యక్తి మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అర్థాన్ని మార్చేశాడు

Update: 2024-09-17 13:27 GMT

దిశ, ఫీచర్స్ : వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కోసం నిపుణులు చాలా టిప్స్ చెప్తుంటారు. వాటిని ఆచరిస్తూ ఎంతో కొంత ఫలితం పొందుతుంటాం. కానీ స్పెయిన్ లో ఓ వ్యక్తి మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అర్థాన్ని మార్చేశాడు. ఆరేళ్లుగా పనికి వెళ్ళకుండానే జీతం తీసుకుంటున్న ఆయన .. ఏకంగా లాంగెస్ట్ వర్కింగ్ ఎంప్లాయీగా అవార్డు కూడా అందుకోబోయాడు. కానీ ఈ అవార్డు ఆయన అసలు పనికే రావట్లేదని బయటపెట్టింది.

అవును.. స్పెయిన్ లో ఈ ఘటన జరిగింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో బిల్డింగ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఎవరికి సమాచారం అందించకుండా ఆరేళ్లుగా జాబ్ స్కిప్ చేశాడు. కానీ ఈ టైంలో తనకిచ్చిన టాస్క్ లు అన్నీ కంప్లీట్ అయ్యాయని.. జీతం మాత్రం తీసుకున్నాడు. దీనివల్ల అక్కడ లాంగ్ టైం వర్క్ చేస్తున్నందుకు ఆయనకు అవార్డు ఇచ్చేందుకు ప్లాన్ జరిగింది. కానీ అప్పుడే అసలు ఆయన ఉద్యోగం చేయడమేంటి అనే ప్రశ్న తోటి ఉద్యోగుల ద్వారా హయ్యర్ అథారిటీ ముందు ఉంచబడింది. పని చేయకుండానే పైసలు తీసుకున్నాడని ప్రూఫ్ అయింది.

Tags:    

Similar News