క్యాప్సికమ్స్ తో ఈ వంటకాలు కూడా చేయవచ్చు.. అవేంటంటే?
క్యాప్సికమ్స్ తో ఈ వంటకాలు కూడా చేయవచ్చు..
దిశ, ఫీచర్స్ : క్యాప్సికమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని బెల్ పెప్పర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి నైట్ షేడ్ కుటుంబానికి చెందిన కూరగాయలు. ఈ మొక్క యొక్క పండ్లు తినదగినవి.. క్యాప్సికమ్స్ వివిధ రంగులలో లభిస్తాయి. టమోటాలు, బంగాళదుంపలు, వంకాయలతో సంబంధం కలిగి ఉంటుంది. బెల్ పెప్పర్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. వీటితో ఈ వంటకాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..
క్యాప్సికమ్ ఫ్రై:
దీనికి కావాల్సిన ఆహార పదార్ధాలు క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్. ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని అవి రంగు మారే వరకు ఉంచండి.. కొంతసేపటి తర్వాత మసాలా వేసి ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. అంతే క్యాప్సికమ్ ఫ్రై రెడీ.
క్యాప్సికమ్ సలాడ్:
దీనికి కావాల్సిన ఆహార పదార్ధాలు క్యాప్సికమ్ ముక్కలు, టమోటాలు, దోసకాయ ముక్కలు. ముందుగా వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో ఐస్ ముక్కలు వేసుకుని, 30 నిముషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయండి. అంతే క్యాప్సికమ్ సలాడ్ సలాడ్ తయారు చేయండి.
క్యాప్సికమ్ పకోడాలు:
మనం ఉల్లిపాయలతో పకోడాలు ఎలా చేసుకుంటామో అదే విధంగా క్యాప్సికమ్ ముక్కలు తీసుకుని శనగపిండిలో వేసుకుని క్యాప్సికమ్ పకోడాలు చేసుకోవచ్చు.
Read More..
ఆ వ్యాధులకు కారణం అవుతున్న టీ, బిస్కెట్.. అలా తినకూడదంటున్న నిపుణులు!