Passion Fruit: ఈ పండుతో ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు
ఈఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
దిశ, ఫీచర్స్: పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకి తెలిసిందే. రోజుకో యాపిల్ తింటే వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్యాషన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఈ పండుతో మన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఈఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ నాలో ఉంటాయి. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ మధ్య కాలంలో కివీ, అవకాడో పండ్లను ఎక్కువగా తింటున్నారు. అలాగే ప్యాషన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి ఇక్కడ చూద్దాం..
డయాబెటిక్ పేషెంట్స్ కి ఈ ఫ్రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది బ్లడ్ లోషుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో బాధ పడేవారు ఈ పండును తింటే ఉపశమనం కలుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.