SUCCESS : మీ విజయాన్ని అడ్డుకుంటున్న కారణాలు ఇవే.. తెలుసుకుని బాగుపడండి...!!
ప్రతి ఒక్కరూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే అనుకుంటారు. కానీ అందరూ ఆ పొజిషన్ కు చేరుకోలేరు. ఇప్పుడున్న లైఫ్ సంతోషంగా, సౌకర్యంగా ఉంది కదా అనుకుని రోటీన్ కు అలవాటు పడిపోతారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. పొద్దున లేచామా..
దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే అనుకుంటారు. కానీ అందరూ ఆ పొజిషన్ కు చేరుకోలేరు. ఇప్పుడున్న లైఫ్ సంతోషంగా, సౌకర్యంగా ఉంది కదా అనుకుని రోటీన్ కు అలవాటు పడిపోతారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. పొద్దున లేచామా.. ఇంట్లో పని చేసుకున్నామా.. ఉద్యోగం చూసుకున్నామా.. మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నామా.. అన్నట్లుగానే కంటిన్యూ అయిపోతారు. కానీ ఆ కంఫర్ట్ జోన్ విడిచి సక్సెస్ కొట్టిన తోటివారిని చూసాకా తామెందుకు ఇలా మిగిలిపోయామని గిల్టీ ఫీల్ అవుతారు. వారు పొందిన గౌరవాన్ని తాము ఎందుకు పొందలేదని బాధపడిపోతారు. అలాంటి బాధ మీకు కలగకుండా ఉండాలంటే.. మీ విజయాన్ని అడ్డుకుంటున్న కారణాలేవో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. అవేంటో కూడా సూచిస్తున్నారు.
వాయిదా వేయడం
జీవితంలో చిన్న చిన్న అలవాట్లే మన లైఫ్ ను నెక్స్ట్ లెవల్ లో నిలబెడుతాయి. ముఖ్యంగా ఈరోజు పని ఈరోజే కంప్లీట్ చేసే అలవాటు మన సక్సెస్ కు కారణం అవుతుందని చెప్తున్నారు నిపుణులు. మన జీవితంలో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు టాస్క్ పూర్తి చేస్తూనే ఉండాలి. అలా కాకుండా వాయిదా వేయడం, ఆలస్యం చేయడం వల్ల సమయం మించిపోతుంది. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయలేక వెనుకబడిపోతారు. జీవితంలో ఫెయిల్ అయిపోతారు.
క్రమశిక్షణ లేకపోవడం
విజయవంతం కావాలంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి స్థిరమైన ప్రయత్నాలు లేకపోవడం.. స్కిల్ డెవలప్మెంట్ ను అడ్డుకోవచ్చు. సరైన నైపుణ్యం పొందడంలో ఆలస్యం కావచ్చు. తోటివారికి పోటీ ఇవ్వలేకపోవచ్చు. మీరు ఈ ఎంచుకున్న లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిపోవచ్చు.
నెగెటివ్ మైండ్ సెట్
తమ గురించి తాము నెగెటివ్ గా మాట్లాడుకోవడం, తమ నైపుణ్యం గురించి అనుమానం పెంచుకోవడం, నీ జీవితం ఇంతే అని సెల్ఫ్ కంప్లయిన్ చేసుకోవడం కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తుంది. జీవితంలో ఏదో చేయాలన్న కసి తగ్గిపోతుంది. మోటివేషన్ అస్సలు లభించదు. ఇలాంటి నెగెటివ్ మైండ్ సెట్ చేసే పనిని అడ్డుకుంటుంది. ఎదగనివ్వకుండా చేస్తుంది.
బాధ్యతలు గాలికే..
జీవితంలో బాధ్యతలు లేకుండా గాలికి తిరిగేవాళ్లకు లైఫ్ సక్సెస్ రుచిని చూపించదు అంటున్నారు నిపుణులు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా సిగ్గుపడటం, మొహమటపడటం.. ఒక పని చేయనివ్వదు. తప్పు, ఒప్పు మధ్య డిఫరెన్స్ నేర్చుకొనివ్వదు. ఈ అలవాటు ఎదుగుదలను అడ్డుకోవడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
టైం సెన్స్ అస్సలుండదు
సమయం మళ్లీ తిరిగిరాదని అందరికీ తెలుసు. అయినా టైం వేస్ట్ చేస్తుంటారు. అసలు పనులు వదిలేసి అవసరంలేని పనులపై ఫోకస్ చేస్తూ సమయం వృధా చేస్తుంటారు. లేదా వర్క్ పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేస్తారు. దీనివల్ల ప్రొడక్టివిటీ ఉండదు. కాబట్టి సక్సెస్ రాదు.
ఫెయిల్యూర్ భయం
ఒకపనిలో ముందే ఎవరు ఎక్స్ పర్ట్ అయి ఉండరు. చేయగా చేయగా అదే వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది అసలు పని ప్రారంభించక ముందే మాకు రాదు కదా? ఎవరు ఏం అనుకుంటారో? తమను తక్కువగా అంచనా వేస్తారేమో? అందరికన్నా తామే వెనుకబడి ఉన్నామేమో? అని భయపడిపోతుంటారు. ఆ పని నేర్చుకునేందుకు ప్రయత్నించక ముందే ఫెయిల్యూర్ వస్తుందనే ఫియర్ ఉంటుంది. మొత్తానికి కొత్త అవకాశాలను స్వీకరించకుండా, ఎదగకుండా అలాగే ఉండిపోతారు.
స్పష్టమైన లక్ష్యం లేక
రెండు పడవలపై ప్రయాణం ఎప్పటికీ తీరాన్ని చేర్చదని చెప్తుంటారు పెద్దలు. అందుకే స్పష్టమైన, నిర్ధిష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచిస్తారు. అప్పుడే విజయతీరాలను చేరగలరని చెప్తుంటారు. అలాకాకుండా అది, ఇది అంటూ ఫోకస్ లేకుండా మొక్కుబడిగా పనిచేస్తే టార్గెట్ రీచ్ అవడం కష్టం అంటున్నారు నిపుణులు.
పట్టుదల సడలింపు
మీరు మీ విజయాన్ని ఆస్వాదించాలంటే పట్టుదలతో ముందుకు సాగాల్సిందే. ఈ క్రమంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ పయనంలో సవాళ్లు ఎదురవుతున్నాయని పట్టు వదిలేస్తే, ఆ లక్ష్యాన్ని సులభంగా వదులుకుంటే.. విజయ దరహాసం మీ ముఖంపై ఎప్పటికీ వికసించదని హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్.
ఆరోగ్యం ముఖ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు మహానుభావులు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండూ ముఖ్యమే. సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే పనిపై ఫోకస్ చేయగలం. విజయాన్ని సాధించగలం అంటున్నారు నిపుణులు.