Sravana Masam : శ్రావణమాసంలో అస్సలే చేయకూడని పనులు ఇవే?
శ్రావణమాసం వచ్చింది. ఈ మాసంలో నోములు వ్రతాలు, పెళ్ళీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ మాసంలో కొన్ని పనులు అస్సలే చేయకూడదంట.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
దిశ, వెబ్‌డెస్క్ : శ్రావణమాసం వచ్చింది. ఈ మాసంలో నోములు వ్రతాలు, పెళ్ళీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ మాసంలో కొన్ని పనులు అస్సలే చేయకూడదంట.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- ఉదయం లేచిన వెంటనే తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలంట.
- శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ, పాలను పానీయంగా తీసుకోకూడదు.
- శివపూజ చేసేవారు రోజూ ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్రలేవడం మంచిది.
- మాంసాహారం, మద్యం సేవించడం తగదు.
- వంకాయ కూర తినకూడదనే విషయం చాలా మందికి తెలియదు. పురణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని సమాచారం. అందువల్ల శ్రావణ మాసంలో దాన్ని తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు చాలామది ఉన్నారు.
Read More : శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?