మీపై చాలా కోపంగా ఉన్నారు కానీ మీకు తెలియనివ్వరు.. ఇలా కనిపెట్టేయొచ్చు..

ఒకరిపై మరొకరు కోపంగా ఉండటం కామన్. కానీ కొందరు ఎదుటి వ్యక్తి మీద అసహనంతో ఉన్నా బయటకు చెప్పరు. కానీ చేతల్లో చూపిస్తారు. అయితే అలా

Update: 2024-06-02 15:25 GMT

దిశ, ఫీచర్స్: ఒకరిపై మరొకరు కోపంగా ఉండటం కామన్. కానీ కొందరు ఎదుటి వ్యక్తి మీద అసహనంతో ఉన్నా బయటకు చెప్పరు. కానీ చేతల్లో చూపిస్తారు. అయితే అలా ఉన్నారని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. పని ప్రదేశాల్లో ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఎదురవుతారు. కాబట్టి కోపంగా ఉన్నారని తెలిసేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో చూసేద్దాం.


1. నో కమ్యూనికేషన్.. ఓన్లీ సైలెన్స్

మనపై కోపం ఉన్నా చెప్పకుండా దాచే వ్యక్తులు.. మనతో మాట్లాడే విధానం, కమ్యూనికేట్ అయ్యే తీరులో మార్పు చూపిస్తారు. ఒక్కోసారి మనం మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉండిపోతారు. కాల్, మెసేజ్ లకు కూడా స్పందించరు. ఇలా చేస్తే ఎప్పటి కోపాన్నో ఇంకా మెయింటేన్ చేస్తున్నట్లు లెక్క. మీ మాటలకు హర్ట్ అయినా చెప్పలేక పోతున్నారని గుర్తించాలి.

2. ఐ కాంటాక్ట్ ఉండదు

ఐ కాంటాక్ట్ మాట్లాడకుండానే కమ్యూనికేట్ అయ్యే విధానం. కానీ నిన్న మొన్నటి వరకు అలా చూసి నవ్విన వ్యక్తి.. సడెన్ గా చూసినా సరే అవాయిడ్ చేస్తున్నారంటే కోపం, పగను అణిచి వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఏదో జరిగిందని గుర్తించాలి.

3. మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్

చిరాకు, అణచివేయబడిన కోపం తరచుగా ఇతర మార్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఎవరి మీద అయితే ఆగ్రహంగా ఉన్నారో ఆ వ్యక్తి కనిపిస్తే మూడ్‌ చేంజ్ అయిపోతుంది. చిరాగ్గా మాట్లాడుతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

4. విమర్శలు ఎక్కువైపోతాయి

మనం ద్వేషిస్తున్న వ్యక్తిని ఇంతకు ముందు చక్కగా ట్రీట్ చేసినా.. ఇప్పుడు మాత్రం తనలోని లోపాలే కనిపిస్తాయి. ఏం మాట్లాడినా, ఏ పని చేసినా విమర్శిస్తుంటాం. వారి గురించి చాటుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటాం. తన గురించే గతంలో జరిగిన స్టోరీస్ చెప్పుకుంటాం. ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాం.


Similar News