నేటి నుంచే రోహిణి కార్తె స్టార్ట్.. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

రోహిణి మొదలైందంటే చాలు రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని అంటుంటారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోహిణిలో ఎండలు దంచికొడుతాయంటారు. కాగా, ప్రస్తుతం రోహిణి కార్తె ఈరోజు( మే25) మొదలై, జూన్ 8 వరకు

Update: 2023-05-25 13:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోహిణి మొదలైందంటే చాలు రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని అంటుంటారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోహిణిలో ఎండలు దంచికొడుతాయంటారు. కాగా,  ప్రస్తుతం రోహిణి కార్తె ఈరోజు( మే25) మొదలై, జూన్ 8 వరకు ఉంటుంది.


 కాగా, రోహిణి కార్తె  పక్షం రోజుల్లో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయంట. ఎండ తీవ్రతకు శరీరం త్వరగా అలిసిపోతుంది. కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా మట్టి కుండ నీరు త్రాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా లాంటివి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ సమయాల్లో మసాలా ఫుడ్ తీసుకోకూడదంట. కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలంట. అంతే కాకుండా ఎక్కువ నీరు తాగాలంట.

Tags:    

Similar News