మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనపిస్తున్నాయా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

రోజు రోజుకు వ్యాధులు అనేవి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది దీని భారిన పడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అయితే కొంత

Update: 2024-05-30 09:50 GMT

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు వ్యాధులు అనేవి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది దీని భారిన పడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అయితే కొంత మంది పిల్లలకు ఇది చిన్న వయసులోనే అటాక్ అవుతోంది. కాగా, మీ పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా వారికి ఆస్తమా ఉందో లేదో తెలుసుకోవచ్చును. కాగా, చిన్న పిల్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వారికి ఆస్తమా ఉన్నట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పదే పదే కఫం రావడం, వాంతులు అవ్వడం, చాతి బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా అనిపించడం లాంటిది అనిపిస్తే తప్పకుండా అది ఆస్తమాగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు.

2. అలర్జెరీ, పొట్ట నొప్పి, అతిసారం, పదే పదే ఏడవడం, చర్మంపై దురద, ఎర్రటి ప్యాచెస్, తల మీద చర్మం, మోచేతులపై దుద్దర్లు వంటివి ఎక్కువగా కనిపించినా అది ఆస్తమా ప్రారంభ సంకేతాలుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు.

3. అలెర్జిక్ రెనిటిస్ అనే సమస్య కూడా పిల్లల్లో తరచూ వస్తూ ఉంటుంది. దీన్ని గవత జ్వరం అంటారు. ముక్కు లోపల పాలిప్స్ పెరగడం, ముక్కులో దురద ఎక్కువగా వేయడం, గొంతులో దురద వేయడం వంటివి జరుగుతాయి. శ్వాసకోశ అలెర్జీ వస్తే ఊపిరి పీల్చుకునేటప్పుడు వదిలినప్పుడు విజిల్ శబ్దం వస్తూ ఉంటుంది. ఇది కూడా ఆస్తమాకు ప్రారంభ లక్షణంగానే చెప్పుకోవాలి.


Similar News