ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూలిక.. అదే 'హిమాలయాల వయాగ్రా'..

హిమాలయాల పేరు వింటే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాదు హిమాలయాలు ఎన్నో రకాల ఔషధ మూలికలకు నిలయం.

Update: 2024-03-20 08:48 GMT

దిశ, ఫీచర్స్ : హిమాలయాల పేరు వింటే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాదు హిమాలయాలు ఎన్నో రకాల ఔషధ మూలికలకు నిలయం. అలాంటి మూలికల్లో ఒక దాని పేరే యార్సాగుంబా. హిమాలయాల్లో పెరిగే యార్సా గుంబా అనే మూలిక అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో దీని ధర రూ.20 లక్షల వరకు పలుకుతోంది. హిమాలయాల్లోని స్థానిక ప్రజలు దీనిని హిమాలయాల బంగారం అని కూడా పిలుస్తారు. అయితే వాతావరణ మార్పులను బట్టి ఫంగస్ సోకిన కొన్ని కీటకాలు మూలికల లాగా ప్రాచుర్యంలోకి వస్తుంది.

యార్సా గుంబా అనేది టిబెటన్ భాషా పదం. యార్సా అంటే వేసవి కీటకం, గుంబా అంటే వేసవి మొక్క. ఈ యార్సా గుంబా అనే మూలిక నేలలో ఉండే ఓ రకమైన ఫంగస్ గొంగళి పురుగుకి వ్యాపించి అది ఒక మూలిక లాగా తయారువుతంది. దీనిని వార్మ్వుడ్ అని కూడా పిలుస్తారు. ఈ మూలిక గడ్డిలా కనిపిస్తుంది. ఇది భారతదేశం, నేపాల్, చైనా, భూటాన్లలో మంచు శిఖరాల దిగువన కనిపిస్తుంది. ఇది పురుష శక్తిని పెంచడానికి, అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

యార్సా గుంబా ఫంగస్ కీటకాల నుంచి ఎలా తయారవుతుంది ?

యార్సా గుంబా ఫంగస్ భూగర్భంలో నివసించే చిమ్మట లార్వాల పై దాడి చేస్తుంది. మరుసటి సంవత్సరం ఇది ఒక మూలిక లేదా గడ్డిలాగా వేసవిలో బయటపడుతుంది. ఈ ఫంగస్ దాదాపు 57 రకాల కీటకాల పై దాడి చేయగలదని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో తేలింది. వీటిలో గొంగళి పురుగుల పై దాడిచేసిన ఫంగస్ ప్రయోజనకరమైనది, ప్రసిద్ధమైనది.

ఈ మూలిక ఏ వ్యాధులను నివారిస్తుంది ?

గొంగళి పురుగు ఫంగస్ ఔషధంగా పనిచేస్తుంది. ఇది వైద్యంలో ఉపయోగించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ ఔషధంగా పరిగణిస్తారు. WWF, TRAFFIC నివేదిక ప్రకారం ఈ మూలికను ఆస్తమా, క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా పురుష బలహీనతను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అందుకే ఇది 'వయాగ్రా ఆఫ్ హిమాలయాస్'గా ప్రసిద్ధి చెందింది. చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, థాయిలాండ్, మలేషియా మార్కెట్లలో ఈ ఫంగస్‌కు చాలా డిమాండ్ ఉంది.

వాతావరణ మార్పుల నుండి ఎందుకు ముప్పు ఉంది ?

వాతావరణ మార్పుల కారణంగా యార్సా గుంబా ఫంగస్ సాగు పై ప్రతికూల ప్రభావం పడింది. గొంగళి పురుగు అనేది ఎత్తైన కొండల పై పెరుగుతుంది. ఇది పెరగడానికి చల్లని వాతావరణం అవసరం. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది ఆయా జాతులకు ముప్పు కలిగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన ఈ మూలికకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరల కారణంగా గొంగళి పురుగుల దోపిడీ కూడా పెరుగుతోంది.

Tags:    

Similar News