ఎక్కువమంది మనశ్శాంతిగా ఫీలయ్యే ఏకైక ప్రదేశం ఏంటో తెలుసా?

‘‘ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో నువ్వూ నేను కలిసి ఐస్ క్రీమ్ తింటూనో, అలా ప్రకృతిని ఆస్వాదిస్తూనో మాట్లాడుకుంటారు.

Update: 2023-07-09 07:53 GMT

దిశ, ఫీచర్స్: ‘‘ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో నువ్వూ నేను కలిసి ఐస్ క్రీమ్ తింటూనో, అలా ప్రకృతిని ఆస్వాదిస్తూనో మాట్లాడుకుంటూ ఉంటే.. అంతకు మించిన మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఎక్కడుంటుంది’’ అనేది పెళ్లికాని యువతీ యువకుల్లో ఎక్కువమందికి కలిగే ఫీలింగ్.. ‘అబ్బ ఎంతసేపూ మీదో లొల్లి. కాసేపు ఎవరూ లేనిచోట కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుంది’’ అనేది పెళ్లయి, పిల్లలు కలిగి, కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతున్న కొందరు స్త్రీ, పురుషుల ఫీలింగ్.

కొందరు జంటగా ఉండటంవల్ల ఆనందంగా భావిస్తుంటే, మరికొందరు ఒంటరిగా ఉండటంవల్లే సంతోషంగా ఉంటున్నట్లు భావిస్తుంటారు. కానీ ఇలాంటి తేడాలేవీ లేకుండా అందరికీ మనశ్శాంతిగా అనిపించే ప్రదేశం ఒకటుంది. అదేంటంటే.. బాత్‌రూమ్. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమేనని యూఎస్ కేంద్రంగా మాసోనిట్ (Masonite), వన్‌పోల్ సంస్థలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో వెల్లడైంది.

ప్రపంచ వ్యాప్తంగా పెళ్లయిన వారు, ఇంట్లో ఇద్దరికంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి నివసించే తల్లిదండ్రులు తరచుగా రిలాక్స్ అవ్వడానికి బాత్ రూమ్‌లోకి వెళ్తారని సర్వే పేర్కొన్నది. తమకు బోర్ కొట్టినప్పుడు అవసరం లేకపోయినా వెళ్తుంటామని యువతీ యువకులు పేర్కొంటున్నారు. 3 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు కలిగిన ఇంటిలోని పెద్దల్లో 61 శాతం మంది, యుక్తవయస్కులైన పిల్లలు కలిగిన ఇంటిలో నివసించే పెద్దల్లో 41 శాతం మంది తాము బాత్ రూమ్‌కు వెళ్లినప్పుడే టెన్షన్ ఫ్రీగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ప్రతీ ముగ్గురిలో ఇద్దరు పెద్దలు ఇంట్లో టీవీలు, సౌండ్ సిస్టమ్స్, పిల్లలు చేసే అల్లరివల్ల అలసిపోయినప్పుడు కాసేపు బాత్ రూమ్‌కు వెళ్లి ప్రశాంతతను పొందుతామని చెప్తున్నారు. ప్రతీ పది మందిలో ఇద్దరు వ్యక్తులు భాగస్వామితో మాట్లాడుతున్న క్రమంలో చిన్నపాటి వివాదం కారణంగా బాత్ రూమ్‌లోకి వెళ్లి ప్రశాంతతను ఫీలవుతుంటారట. ఇక 48 ఏళ్లు, ఆ పై వయస్సుగల వ్యక్తుల్లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు అవసరం ఉన్నా, లేకపోయినా బాత్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు సాధారణంకంటే ఎక్కువ సమయం గడుపుతూ పొగ పీల్చడం, ఆలోచించడం చేస్తూ రిలాక్సేషన్ ఫీలవుతుంటారని సర్వే పేర్కొన్నది.

20 ఏళ్లలోపు యువతీ యువకుల్లో ప్రతీ నలుగురిలో ఇద్దరు తాము చదువు, హోం వర్కు పరంగా ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు బాత్ రూమ్‌లోకి వెళ్తేనే మనశ్శాంతిగా భావిస్తామని వెల్లడించారు. 21 నుంచి 35 ఏళ్లలోపు యువతీ యువకుల్లో ప్రతీ పదిమందిలో నలుగురు తాము బాత్ రూమ్‌లోకి వెళ్లి హస్త ప్రయోగం చేసుకోవడం, ఇష్టమైన వ్యక్తిని మనసులో ఊహించుకోవడం ద్వారా రిలాక్స్‌గా భావిస్తామని పేర్కొన్నట్లు సర్వే వెల్లడించింది. కారణాలేమైనా ఎక్కువమంది బాత్ రూమ్‌ను మనశ్శాంతికి కేరాఫ్ అడ్రస్‌గా భావిస్తున్నారట.


Similar News