హై జెనెటిక్ రిస్క్ బాధితుల్లోనూ డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గిస్తున్న వ్యాయామం
వ్యాయామం లేదా శారీరక శ్రమ డయాబెటిస్ బాధితుల్లో అనారోగ్యాల ప్రభావాన్ని తగ్గిస్తుందని మనకు తెలిసిందే.
దిశ, ఫీచర్స్: వ్యాయామం లేదా శారీరక శ్రమ డయాబెటిస్ బాధితుల్లో అనారోగ్యాల ప్రభావాన్ని తగ్గిస్తుందని మనకు తెలిసిందే. కానీ హై జెనెటిక్ రిస్క్ కలిగిన వ్యక్తుల్లో ఇది ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు ఇటీవల మొత్తం ఫిజికల్ యాక్టివిటీస్ యొక్క హయ్యర్ లెవల్స్ మధ్య బలమైన సహసంబంధాన్ని కనుగొన్నారు. జెనెటిక్ రిస్క్ ఉన్నవారిలో కూడా రన్నింగ్, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు, కాస్త అధిక శారీరక శ్రమ కలిగి ఉండటం టైప్ 2 మధుమేహ ప్రభావాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.
ఈ వివరాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో కూడా పబ్లిష్ అయ్యాయి. అధ్యయనంలో భాగంగా నిపుణులు యూకే బయోబ్యాంక్‌కు చెందిన 59,325 మంది అడల్ట్స్‌ను పరిశీలించారు. బాధితుల మణికట్టుపై యాక్సిలెరోమీటర్లను ధరిపంజేసి ఆరోగ్య ఫలితాలను ఏడేళ్లపాటు ట్రాక్ చేశారు. ఈ సందర్భంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలను, ప్రమాదాలను పెంచే జన్యు మార్కర్ల పనితీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు ఎక్కువసేపు శారీరక శ్రమ, వ్యాయామాలు కలిగి ఉన్న హై జెనెటిక్ రిస్క్ స్కోర్ ఉన్న వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 2.4 రెట్లు తగ్గిందని గుర్తించారు.