‘మార్నింగ్ ఫెటీగ్’ వేధిస్తోందా? .. అయితే ఇలా చేయండి!
మీరు మేల్కొన్నప్పుడు, పగటివేళ వివిధ పనుల్లో నిమగ్నమైనప్పుడు కొన్నిసార్లు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
దిశ, ఫీచర్స్: మీరు మేల్కొన్నప్పుడు, పగటివేళ వివిధ పనుల్లో నిమగ్నమైనప్పుడు కొన్నిసార్లు అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది సాధారణమే కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ రెగ్యులర్‌గా అదే పరిస్థితి కొనసాగితే, నిరంతరం అలసిపోయినట్లు మీరు ఫీలవుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే అది మార్నింగ్ ఫెటీగ్(Morning Fatigue)అనే స్లీప్ డిజార్డర్ లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ అయి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా ఇది పోషకాహార లోపాలవల్ల తలెత్తుతుంది. రుగ్మతగా మారినప్పుడు ఆనందంగా, సంపూర్ణంగా జీవించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
ఐరన్ లెవల్స్ చెక్ చేయండి
పోషకాహార లోపం వల్ల కూడా మార్నింగ్ ఫెటీగ్ రుగ్మత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు రోజూ అలసిపోతారు. బాడీలో ఐరన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడంవల్ల కూడా ఇలా జరుగుతుంది. అదనంగా విటమిన్ డి లోపం కూడా ఇందుకు కారణం అవుతుంది. వీటిని గుర్తించి, నివారించగలిగే పోషకాహారం తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది.
ప్రశాంతమైన నిద్ర
ప్రశాంతమైన నిద్రలేకపోవడం వల్ల కూడా శరీరంలో సర్కాడియన్ రిథమ్ లేదా స్లీప్- వేక్ సైకిల్‌ను(sleep-wake cycle) నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల మార్నింగ్ ఫెటీగ్ డిజార్డర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. పిస్తా, ద్రాక్ష, టమోటా వంటి ఆహారాలతో పాటు తాజా కూరగాయలు నిరంతరం తీసుకోవడంవల్ల ఈ సమస్య దూరం అవుతుంది. అలాగే మీ ఎనర్జీ లెవల్స్‌ను పునరుద్ధరించుకోవడానికి పోషకాహారంతోపాటు వ్యాయామం లేదా యోగాసనాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లల భంగిమ, శవాసనం, బట్టర్ ఫ్లయ్ ఆసనం వంటివి మార్నింగ్ ఫెటీగ్‌ను తగ్గిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
Read More... బ్రెయిన్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్న వాకింగ్ .. తాజా అధ్యయనంలో వెల్లడి