సెక్స్ సమ్మతి వయస్సు 16 ఏళ్లకు పెంచుతూ కొత్త చట్టం..

జపాన్ లైంగిక నేరాల చట్టాలలో సమూల మార్పుల తీసుకొచ్చింది.

Update: 2023-06-17 12:55 GMT

దిశ, ఫీచర్స్ : జపాన్ లైంగిక నేరాల చట్టాలలో సమూల మార్పుల తీసుకొచ్చింది. అత్యాచారాన్ని పునర్ నిర్వచించడంతో పాటు సెక్స్ సమ్మతి వయసును పెంచుతూ సరికొత్త చట్టాలను ఆమోదించింది. అంతకుముందు ఉన్న సెక్స్ సమ్మతి వయసును 13 ఏళ్లును.. ప్రస్తుతం 16 ఏళ్లకు పెంచింది. ఈ కొత్త చట్టాన్ని.. జపాన్ పార్లమెంట్ డైట్ ఎగువ సభలో తాజాగా ఆమోదించింది. అంతేకాదు ఇంతకు ముందు రేప్ అంటే ‘బలవంతంగా లైంగిక దాడి’ చేయడం. కానీ ఇప్పుడు ‘సమ్మతి లేని లైంగిక సంపర్కం’ అని పునర్నిర్వచించింది.

అయితే బలవంతంగా సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చిన మహిళలు, రేప్‌కు గురైన బాధితులు రిపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. అలా అసమ్మతిని వ్యక్తపరచడానికి ఇబ్బంది పడే సందర్భాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చి హింసిస్తూ బెదిరించడం లాంటిది చేసినప్పుడు, ఆ మహిళ ఎదురుతిరిగితే నష్టం కలుగుతుందని భావించి మౌనంగా ఉంటుంది. ఇలా భయంతో అమ్మాయిలు రేప్‌కు గురికావడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో చట్టాలు బాధితులకు అండగా ఉండట్లేదని, రిపోర్ట్ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయని విమర్శలు రావడంతో మార్పులు తీసుకొచ్చింది.

1. అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి జపాన్. 1907లో ఈ చట్టాన్ని రూపొందించిన తర్వాత తొలిసారి సెక్స్ సమ్మతి వయసును జపాన్ మార్చింది. 13 నుంచి 15 ఏళ్ల వయసులోని మైనర్ బాలిక‌తో, ఆమె కంటే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు సెక్స్‌లో పాల్గొంటేనే వారిపై చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటుగా తనపై అత్యాచారం జరిగినట్లు బాధితులు ముందుకొచ్చి రిపోర్టు చేసేందుకు అదనపు సమయాన్ని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. లైంగిక దృశ్యాలు రహస్యంగా చిత్రీకరించడం, అనుమతి లేకుండా మహిళలు వస్త్రాలు మార్చుకుంటుంటే ఫొటో తీయడాన్ని కూడా నిషేధించింది.

2. ప్రస్తుతం చేసిన ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, తమపై జరుగుతున్న దాడులను రిపోర్ట్ చేసే ధైర్యం మహిళలకు ఉండాలని కార్యకర్తలు చెబుతున్నారు. ఎందుకంటే జపాన్‌లో సగానికి సగం మంది బాధితులు భయం, అవమానభార కారణంతో లైంగిక వేధింపుల గురించి ముందుకు వచ్చి రిపోర్ట్ చేసేందుకు ఇష్టపడటం లేదు. అలా ఇప్పటివరకు ప్రభుత్వం జరిపిన 2021 సర్వేలో కేవలం 6 శాతం మంది మహిళలు, పురుషులు మాత్రమే ఈ వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చట్టం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం తప్పనిసరి అని, ఇలా చేస్తే సమాజంలో లైంగిక హింస అరికట్టగలమని చెబుతున్నారు.

3. జపాన్‌లో రేప్‌ జరిగిన విధానాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు వారికి అనుకులంగా మార్చుకుని బాధితులకు న్యాయం జరగనివ్వరని తెలిసి చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు 2014లో టోక్యోలో ఒక వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని గోడకు అణచిపెట్టి ఆమెతో సెక్స్ చేశాడు. కానీ, అతనికి కోర్టు శిక్ష వేయలేదు. పైగా ‘అతని దాడి శిక్షించేంతగా ఏం లేదు. అందుకే అది రేప్ కాదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే అప్పుడు జపాన్‌లో సమ్మతి వయసు 13 ఏళ్లు, ఆ బాలిక వయసు 15 ఏళ్లు కావడంతో ఆమెను యువతిగా కోర్టు పరిగణించింది. మొత్తానికి ఈ చట్టంలో సవరణలు కేవలం ఈ సమస్యను పరిష్కరించడంలో ఒక భాగం మాత్రమేనని కార్యకర్తలు అంటున్నారు. కోర్టు రూమ్‌ వెలుపల భారీ మార్పులు రావాల్సి ఉందన్నారు. 

ఇవి కూడా చదవండిఅశ్లీల చిత్రాలు చూస్తున్న పురుషులు.. తమను తాము ఆ వీడియోల్లో ఊహించుకుంటూ..


Similar News