పెళ్లి మండపానికి తాగివచ్చిన వరుడు.. వధువు చేసిన పనికి అంతా షాక్
పెళ్లి అనగానే మందు, చిందు అనేది కామన్.ఎక్కడ పెళ్లి జరిగినా సరే మద్యం తాగుతు చాలా ఏంజాయ్ చేస్తుంటారు యూత్. అయితే పెళ్లిలో వరుడు తరఫున స్నేహితులు లాంటి వారు తాగితే కామన్, కానీ ఇక్కడ ఏకంగా పెళ్లి కొడుకే ఫుల్‌గా మందు కొట్టి
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనగానే మందు, చిందు అనేది కామన్.ఎక్కడ పెళ్లి జరిగినా సరే మద్యం తాగుతు చాలా ఏంజాయ్ చేస్తుంటారు యూత్. అయితే పెళ్లిలో వరుడు తరఫున స్నేహితులు లాంటి వారు తాగితే కామన్, కానీ ఇక్కడ ఏకంగా పెళ్లి కొడుకే ఫుల్‌గా మందు కొట్టి, పందిట్లో కూర్చొన్నాడు.
ఇక వరుడు మద్యం సేవించాడని గ్రహించిన వధువు షాకింగ్ డెసిషన్ తీసుకొంది. అసలు విషయంలోకి వెళ్లితే.. యూపీలోని వారణాసి జిల్లా చౌబేవూర్‌కు చెందిన వ్యక్తికి, జన్సాకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో వీరికి పెద్దలుు ఆదివారం రోజున ఘనంగా వివాహం జరిపించడానికి రెడీ అయ్యారు. అనుకున్న సమయానికే, వధూ వరులు పీటలపై కూర్చొగా, వరుడు ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకొని, ఫుల్‌గా తాగి పెళ్లిపీటలెక్కాడు. దండలు మార్చుకొనే సమయంలో వరుడు తాగివున్నాడని గమనించిన వధువు పెళ్లి వద్దని స్టేజ్ దిగి వెళ్లిపోయింది.ఎంత మంది చెప్పినా వినకుండా పెళ్లి వద్దంటూ మండపం నుంచి వెళ్లిపోవడంతో ఆ పెళ్లి రద్ధైంది.
Read more: