RAKHI FESTIVAL: రాఖీ కట్టాక డబ్బులిచ్చే ఆచారం.. దీని వెనకున్న అసలు చరిత్ర ఇదే?

సోదరులకు సోదరీమణులంతా రాఖీలు కట్టి వాట్సప్ స్టేటస్‌లతో మారుమోగిస్తున్నారు.

Update: 2024-08-19 07:54 GMT

దిశ, ఫీచర్స్: సోదరులకు సోదరీమణులంతా రాఖీలు కట్టి వాట్సప్ స్టేటస్‌లతో మారుమోగిస్తున్నారు. హ్యాపీ రాఖీ అన్నాదమ్ముళ్లు అని క్యాప్షన్ రాసి తమ బ్రదర్స్ పైనున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి బ్రదర్స్ కు రాఖీ కట్టాక సిస్టర్స్ బహుమతులు, లేదా డబ్బులు తీసుకుంటారు. మరీ ఈ డబ్బులు తీసుకునే ఆచారం ఎందుకు వచ్చింది. రాఖీ కట్టాక మనీ తప్పకుండా ఇవ్వాలా శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..

పూర్వకాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ఆడపిల్లలకు తొందరగా వివాహం చేసి అత్తారింటికి పంపించేవారు. పెళ్లాయ్యాక ప్రతి రాఖీకి పుట్టింటికి వచ్చి.. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీ కట్టేవారు. దీంతో సిస్టర్స్ ఆర్థిక అవసరాలకు తెలుసుకుని వారికి కొంత డబ్బు అండ్ బహుమతులు ఇచ్చేవారట. జీవితంలో ఎప్పుడైనా సరే రక్షణగా, అండగా మీకు తోడు నిలుస్తామని భరోసా ఇచ్చేవారట. కాగా అప్పటి నుంచి ఈ సంప్రదాయం వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రెజంట్ డేస్ లో రాఖీ కడితే మనీ, గిఫ్ట్స్ తీసుకోవడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. కమర్షియల్ ఫేస్టివల్ గా మారిపోయిందని అంటున్నారు.

Tags:    

Similar News