వృద్ధాప్యం.. మనిషికా? మెదడుకా?
వృద్ధాప్యం దరిచేరితే చుట్టుముట్టే అనేక సమస్యల్లో మెదడు పనితీరు మందగించడం ఒకటి. ఈ క్రమంలోనే జ్ఞాపకశక్తి తగ్గడం, ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వంటివి గమనిస్తుంటాం. కానీ మనం సాధారణంగా నమ్మే
దిశ, ఫీచర్స్ : వృద్ధాప్యం దరిచేరితే చుట్టుముట్టే అనేక సమస్యల్లో మెదడు పనితీరు మందగించడం ఒకటి. ఈ క్రమంలోనే జ్ఞాపకశక్తి తగ్గడం, ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వంటివి గమనిస్తుంటాం. కానీ మనం సాధారణంగా నమ్మే దానికంటే వృద్ధుల మెదడు మరింత ఆచరణాత్మకమైనదని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ వయసులో మెదడులోని కుడి, ఎడమ అర్ధగోళాల(హెమిస్పియర్స్) పరస్పర చర్య శ్రావ్యంగా మారుతుందని, ఇది వారిలో సృజనాత్మక అవకాశాలను విస్తరిస్తుందని తెలిపారు. అందుకే 60 ఏళ్లు పైబడిన తర్వాతే సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మంది వ్యక్తులు మనకు నిత్యం తారసపడుతుంటారు.
వాస్తవానికి మెదడు యవ్వనంలో ఉన్నంత వేగంగా ఉండదు. కానీ ఇది ఫ్లెక్సిబిలిటీని పొందుతుంది. అందువల్ల వయసు పెరిగే కొద్దీ సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు ప్రతికూల భావోద్వేగాలకు తక్కువగా బహిర్గతమవుతుంది. అంటే.. మానవ మేధో కార్యకలాపాల గరిష్ట స్థాయి అనేది 70 ఏళ్ల వయసులో మెదడు పూర్తి శక్తితో పనిచేయడం ప్రారంభించినప్పుడు సంభవిస్తుంది. ఇలా కాలక్రమేణా మెదడులోని మైలిన్(ఇది న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా వెళ్లేలా చేస్తుంది) పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగానే సగటుతో పోలిస్తే మేధో సామర్థ్యాలు 300% పెరుగుతాయి. 60 ఏళ్ల తర్వాత, ఒక వ్యక్తి 2 అర్ధగోళాలను ఒకే సమయంలో ఉపయోగించగలడనే వాస్తవం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
'వృద్ధుడి మెదడు తక్కువ శక్తిని వినియోగించే మార్గాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి అనవసరమైన విషయాలను తొలగిస్తుంది. తద్వారా సమస్య పరిష్కారానికి సరైన ఎంపికలను మాత్రమే విడుదల చేస్తుంది' అని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మోంచి ఉరి తెలిపారు. ఇక వివిధ వయసుల వారికి సంబంధించిన ఒక అధ్యయనంలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు యువకులు చాలా గందరగోళానికి గురవగా.. 60 ఏళ్లు పైబడిన వారు సరైన నిర్ణయాలు తీసుకున్నారు.
60 నుంచి 80 ఏళ్ల వయసులో మెదడు లక్షణాలు :
* అందరూ చెప్పినట్లు మెదడులోని న్యూరాన్లు చనిపోవు. మానసిక పనిలో పాల్గొనకపోతేనే వారి మధ్య సంబంధాలు అదృశ్యమవుతాయి.
* సమాచారం అధికంగా ఉండటం వల్ల పరధ్యానం, మతిమరుపు ఏర్పడుతుంది. అందువల్ల జీవితమంతా అనవసరమైన ట్రిఫ్లెస్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదు.
* 60 ఏళ్ల వయసు నుంచి ఒక వ్యక్తి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, యువకుల వలె ఒకే సమయంలో ఒక అర్ధగోళాన్ని కాకుండా రెండింటినీ ఉపయోగిస్తాడు.
* ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ కదలికలు, ఆచరణీయమైన శారీరక శ్రమను కలిగి ఉండి, మానసికంగా చురుగ్గా ఉంటే మేధో సామర్థ్యాలు వయసుతో పాటు పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇంకా 80-90 ఏళ్ల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.
అందువల్ల, వృద్ధాప్యానికి భయపడవద్దు. మేధోపరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలి. కొత్త కొత్త హస్తకళలు నేర్చుకోవాలి. పెయింటింగ్, డ్యాన్స్, సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకోవాలి. స్నేహితులను కలవడం, కమ్యూనికేషన్ పెంచుకోవడం, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడంతో పాటు నచ్చిన ప్రదేశాలకు ప్రయాణించడం ద్వారా జీవితంపై ఆసక్తిని పెంచుకోవాలి. ఇలా కాకుండా ఒంటరిగా నోరు మూసుకుని మూలన కూర్చుంటే మాత్రం అది ఎవరికైనా వినాశకరమైనదే. సో.. ఆలోచనతో జీవిస్తే, అంతా మంచే జరుగుతుంది!