Blood group: మీరు పొరపాటున తప్పు బ్లడ్ గ్రూప్ ఎక్కించుకుంటే కనిపించే లక్షణాలు ఇవే?

మానవ రక్తాన్ని ప్రధానంగా నాలుగు గ్రూపులుగా వర్గీకరిస్తారు.

Update: 2024-09-29 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: మానవ రక్తాన్ని ప్రధానంగా నాలుగు గ్రూపులుగా వర్గీకరిస్తారు. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C, గ్రూప్ ఏబీ. నెగిటివ్, పాజిటివ్ అని ఇలా ఎనిమిది రకాలు ఉంటాయి. AB నెగటివ్ ఎనిమిది ప్రధాన రక్త రకాల్లో అరుదైనది. అయితే చాలా మంది వారికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ వారి రక్తం తమ శరీరంలోకి ఎక్కించుకుంటారు. ఇందుకు ఎంతో మంది రక్తదానం చేయడానికి ముందుకొస్తారు కూడా. కాగా మనం ఎవరికై రక్త దానం చేయాలంటే, పొందాలంటే.. బ్లడ్ గ్రూప్ లకు సంబంధించిన కనీస అవగాహన అనేది తప్పకుండా ఉండాలి.

ఒక పర్సన్ తప్ప బ్లడ్ గ్రూపును ఎక్కించుకోవడం వల్ల బాడీలో ఏం జరుగుతుందని తాజాగా వైద్య నిపుణులు వెల్లడించారు. కాగా ఏ ఏ సమస్యలు తలెత్తుతాయో ఓసారి చూద్దాం.. వేరే గ్రూపుకు సంబంధించి బ్లడ్ గ్రూప్ ఇతరులకు ఎక్కిస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఆ పర్సన్ కు అధికంగా రక్తస్రావం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గుండె పనితీరు, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. బాడీలో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. బ్లడ్ సర్కులేషన్ కు అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా చర్మ అలెర్జీలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఏ చిన్న పని చేసిన తొందరగా అలసిపోతారు. బాడీ ఎల్లో కలర్ లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News