Diabetes : మీకు మధుమేహం ఉందా..? కళ్లల్లో ఈ మార్పులను బట్టి గుర్తించడం ఈజీ!
ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకసారి వచ్చాక అది పూర్తిగా నయం కాదు. అయితే కళ్లల్లో కొన్ని సంకేతాలను బట్టి కూడా దానిని గుర్తించవచ్చా?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకసారి వచ్చాక అది పూర్తిగా నయం కాదు. అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం మందులు వాడటం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. అయితే కొందరు ఈ వ్యాధి బారిన పడే వరకు దానిని గుర్తించలేకపోతున్నారు. శరీరంలో ఏదో ఒక సమస్య ఎదురయ్యాక ఆప్పత్రులకు వెళ్లినప్పుడు, అక్కడ నిర్వహించే మెడికల్ టెస్టుల తర్వాత అసలు విషయం తెలిసి ఆందోళన చెందుతుంటారు. ముందస్తు సంకేతాలు లేదా లక్షణాలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ప్రారంభానికి ముందు కళ్లల్లో కనిపించే లక్షణాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
* దృష్టి లోపం : ఉన్నట్లుండి కంటి చూపులో మార్పులు సంభవిస్తాయి. అస్పష్టమైన దృష్టిని అనుభవిస్తారు. ఈ సంకేతాలు మీలో కనిపిస్తే గనుక డయాబెటిస్ ప్రారంభ దశలో ఉందని అర్థం. రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులవల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ విధమైన మార్పు ఐ లెన్స్ వాపునకు దారితీయడం వల్ల కళ్లల్లో అస్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది. దీనిని బట్టి మీ రక్తంలో చక్కెరస్థాయిలు సాధారణంకంటే ఎక్కువగా పెరిగిపోయాయని తెలుసుకోవచ్చు. వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.
* కళ్లల్లో నొప్పి : మధుమేహం ప్రారంభంలోనే నరాలపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కళ్లల్లో నొప్పి లేదా ఒక విధమైన ఒత్తిడిని అనుభవిస్తు్న్న భావన ఏర్పడుతుంది. మీలో ఆ సంకేతాలు కనిపిస్తే మధుమేహం బారిన పడి ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా గ్లాకోమా వంటి పరిస్థితికి దారితీయవచ్చు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు పాటించడం బెటర్.
* కంటి చుట్ట పక్కల వాపు : కళ్లలో ఒత్తిడి వంటి భావనతోపాటు కళ్లచుట్టూ వాపు కనిపించడం కూడా మధుమేహం ప్రారంభ లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి కంటి కణాలపై ప్రభావం పడినప్పుడు ఇలా వాపు సంభవిస్తుంది. దీంతో కనురెప్పలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇలాంటి సంకేతం మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
* రాత్రిళ్లు అస్పష్టత : రాత్రిపూట వెలుతురులో ఉంటే కళ్లకు ఇబ్బందిగా అనిపించడం, బ్లర్‌గా కనిపించడం, కళ్లు గుంజడం వంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ ప్రారంభ సంకేతం కావచ్చు. వీటిని మీలో కనిపిస్తే గనుక జాగ్రత్త పడాలి. మధుమేహం మొదట నరాలపై ప్రభావం చూపడంవల్ల రాత్రిళ్లు అస్పష్టంగా కనిపంచే సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెరస్థాయిలు అదుపు తప్పడంవల్ల ఇలా జరుగుతుంది. మధుమేహం ప్రారంభ లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.