Sweet Roti: ఎన్నో పోషకాలు ఉన్న స్వీట్ రోటిని ఇలా తయారు చేసుకోండి..

చాలా మందికి ఇష్టమైన వంటకాలలో స్వీట్ రోటీ ఒకటి. అలాగే కొంత మందికి ఈ వంటకం తెలిసి ఉండకపోవచ్చు.

Update: 2024-07-25 09:39 GMT

దిశ, ఫీచర్స్: చాలా మందికి ఇష్టమైన వంటకాలలో స్వీట్ రోటీ ఒకటి. అలాగే కొంత మందికి ఈ వంటకం తెలిసి ఉండకపోవచ్చు. కానీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో దీనిని తయారు చేస్తారు. ఈ రోటీ కోసం గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, యాలకులు లేదా జీడిపప్పు వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. అలాగే ఈ రోటీ కమ్మని రుచితో పాటు ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. కాకపోతే పోషక విలువ మనం వాడే పదార్థాల పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో చూద్దాం..

కావలసినవి:

గోధుమ పిండి-1 కప్పు

నెయ్యి-1/2 కప్పు

చక్కెర-1/4 కప్పు

యాలకుల పొడి-1/4 టీ స్పూన్

ఉప్పు-1/4 టీ స్పూన్

నీరు లేదా పాలు- తగినంత

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, చక్కెర, యాలకుల పొడి, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీరు లేదా పాలు పోస్తూ పిండి సాఫ్ట్‌గా వచ్చేలా కలపండి. అలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి. పది నిమిషాలు అయిన తర్వాత ఆ పిండిని తీసుకొని 10 చిన్న ఉండలు వచ్చేలా చేసుకోండి. తర్వాత ఒక ఉండను తీసుకొని చపాతీ పీట మీద రౌండ్‌గా వచ్చేలా రోటీని చేయండి. ఇక వేడి చేసిన తవా మీద రోటిని వేసి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. మిగిలిన రోటీలను కూడా ఇలాగే కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్ రోటీలు రెడీ అయిపోతాయి. వీటిని వేడిగా ఉన్న పాలు, పెరుగు లేదా చట్నీతో తింటే సూపర్‌గా ఉంటాయి.

రోటీలో ఉండే పోషకాలు:

ఐరన్: ఈ స్వీట్ రోటీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆక్సిజన్ రవాణాకు దోహదపడుతుంది.

ఫైబర్: స్వీట్ రోటీలో కొద్దిపాటి ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

విటమిన్లు, ఖనిజాలు: స్వీట్ రోటీ విటమిన్ B1, B2, నియాసిన్‌తో సహా కొన్ని విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. ఇది మెగ్నీషియం, పొటాషియం, జింక్‌కు కూడా మంచి మూలం.

నోట్: స్వీట్ రోటీలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని మితంగా తినడం ముఖ్యం.

Tags:    

Similar News