మీ సోషల్ సర్కిల్‌ను లెక్కించగలరా? ప్రతి ఒక్కరూ 10 మంది గుడ్ ఫ్రెండ్స్‌ను కలిగి ఉంటారట
మీ సోషల్ సర్కిల్ ఎంత పెద్దది?
దిశ, ఫీచర్స్ : మీ సోషల్ సర్కిల్ ఎంత పెద్దది? చిన్నప్పటి నుంచి మొదలు పెద్దయ్యే వరకు ఎంతమంది గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు తెలుసో లేదో కానీ ఒక కొత్త సర్వే మాత్రం సగటు వయోజన వ్యక్తికి ఆరేండ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి 10 మంది ‘గుడ్’ ఫ్రెండ్స్‌ను కలిగి ఉంటున్నారని యునైటెడ్ కింగ్‌డమ్ కేంద్రంగా 2000 మంది వ్యక్తులపై డిస్నీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సగటు వ్యక్తి తన జీవితకాలంలో ఒక మంచి ఫ్రెండ్‌తో 39 వేల గంటలు నవ్వుతూ గడిపారని, 630 సీక్రెట్స్‌ను తమ సన్నిహితులతో షేర్ చేసుకున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు తెలిపారు.
చాలామంది ఇష్టపడేది?
సహజంగానే చాలా మంది వ్యక్తులు తమ స్నేహితులందరినీ బాల్యం, టీనేజీ దాటిన తర్వాత తరచుగా కలుసుకోరు. దురదృష్టవశాత్తు అన్ని స్నేహాలు కూడా శాశ్వతంగా ఉండవు. సగటు స్నేహం 17 సంవత్సరాల పాటు కొనసాగుతుందని, అయినప్పటికీ 17 శాతం మంది తమకు 30 సంవత్సరాలకుపైగా అదే బెస్ట్ ఫ్రెండ్‌ను కలిగి ఉన్నారని సర్వే పేర్కొన్నది. అయితే ఒక వ్యక్తిని మంచి స్నేహితునిగా భావించే అంశాలను కూడా నిపుణులు పరిశీలించారు. మంచి శ్రోతగా ఉండే వ్యక్తిని చాలామంది మంచి స్నేహితునిగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతోపాటు తమతో నిజాయితీగా వ్యవహరించడం, వ్యక్తిగత అంశాలు, దుస్తుల విషయంలో మంచి సలహాలు ఇవ్వడం, నవ్వించడం, సందర్భోచితంగా ప్రశంసించడం విషయాలను పలువురు మంచి స్నేహితుల లక్షణంగా పేర్కొంటున్నారు.
మాట్లాడకున్నా మారని ఓపీనియన్
‘స్నేహబంధాలు చాలా ముఖ్యమైనవి, కానీ మనం పెద్దయ్యాక, వివిధ కారణాల వల్ల తరచూ కలుసుకోవడం చాలా కష్టమవుతుంది’ అని డిస్నీ కన్జ్యూమర్ ప్రొడక్ట్, గేమింగ్ అండ్ పబ్లిషింగ్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ వైస్ ప్రెసిడెంట్ సారా ఫాక్స్ అంటున్నారు. ప్రతీ పది మందిలో ఏడుగురు క్లోజ్ ఫ్రెండ్స్‌ను తమకు సహాయం అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ ఆశ్రయించగలిగే నమ్మకమైన వ్యక్తిగా చూస్తారని అతను పేర్కొన్నాడు. మొత్తమ్మీద యావరేజ్ అడల్ట్స్ వారానికి 4 గంటలు తమ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారని, 48 శాతం మంది తమ గుడ్ ఫ్రెండ్‌తో రోజులో ఒక్కసారి కూడా మాట్లాడకుండా రోజు గడవదని పేర్కొన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఇక చాలామంది పెద్దయ్యాక తరచూ మాట్లాడుకోకపోయినా తమ చిన్ననాటి బెస్ట్ లేదా గుడ్ ఫ్రెండ్స్‌ను జీవితంలో ఎన్నాళ్లకు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా అదే ఓపీనియన్‌తో ఉంటున్నారు. సరదాగా మాట్లాడుకోవడం, విషయాలు షేర్ చేసుకోవడం, అవసరమైతే హెల్ప్ చేసుకోవడం కొనసాగిస్తున్నారని సర్వే పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి: పేరెంట్స్ డ్రింకింగ్ హాబిట్స్‌తో వ్యసనానికి గురవుతున్న పిల్లలు