Super spreaders: డెంగ్యూ వ్యాప్తికి కారణమవుతున్న ‘సూపర్ స్ప్రెడర్స్‘.. తాజా అధ్యయనం
డెంగ్యూ ఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిందే.
దిశ, ఫీచర్స్: డెంగ్యూ ఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్‌ను కుట్టిన దోమలు మరో వ్యక్తిని కుట్టడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే దోమల్లోకి ఆ వ్యాధికారక వైరస్ ఎలా వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. తాజా అధ్యయనంలో అందుకు తగిన ఆధారం లభించింది. ఆయా ప్రదేశాల్లో ఉండే ఒక రకమైన సూపర్ స్పైడర్ (Hidden super spreaders) అందుకు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దోమలు ఆ సూపర్ స్పైడర్ల కుట్టడం ద్వారా వాటిలోకి డెంగ్యూ కారక వైరస్ వ్యాపిస్తుందట. ఆ తర్వాత దోమలు మనుషులకు కుట్టడం ద్వారా వారిలో లక్షణాలు బయటపడతాయి. ఈ పరిశోధన వివరాలు PNAS Nexus జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. డెంగ్యూ, వివిధ ఇన్ ఫెక్షన్ల వ్యాప్తికి మానవ కార్యకలాపాలు 8 శాతం కారణమవుతుండగా, సూపర్ స్పైడర్ల పరోక్షంగా 74 శాతం ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నాయి. అయితే ఈ ‘సూపర్ స్పైడర్ల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ లక్షణాలు అంత త్వరగా బయటపడవని, లక్షణ రహితమైన ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయని అధ్యయనంలో పాల్గొన్న ఎమోరీ యూనివర్సిటీ (Emory University) పర్యావరణ శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ గాంజలో వాజ్క్వెజ్-ప్రోకోపెక్ (Gonzalo Vazquez-Prokopec) చెప్పారు. డెంగ్యూ వ్యాప్తికి హాట్‌స్పాట్ కేంద్రంగా ఉన్న పెరూలోని ఇక్విటోస్ అనే అమెజోనియన్ నగరంలోని రెండు వేర్వేరు పరిసరాల్లో 4,600 మందిలో డెంగ్యూ వ్యాప్తికి సూపర్ స్పైడర్లు కారణమైనట్లు అధ్యయనంలో వెల్లడైంది.
Also Read..
ముట్టుకోకుండానే పెన్సిల్‌ను వంచొచ్చు.. విరగ్గొట్టొచ్చు.. మళ్లీ నార్మల్‌గా చేయొచ్చు... ఎలా తెలుసా?