తెల్ల జుట్టుతో బాధపతున్నారా? ఈ ఆయిల్‌తో మటుమాయం!
ప్రస్తుత రోజుల్లో అందరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో అందరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆయుర్వేద నిపుణులు చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వండి. అవేంటో చూద్దామా..
* తెల్ల జుట్టుతో సమస్యతో బాధపడేవారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
* ప్రతి రోజూ కేవలం పోషకాలు కలిగి ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
* ఈ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంది.
* అలాగే కొబ్బరి, ఉసిరి ఆయిల్ చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కొబ్బరి, ఉసిరి అయిల్ తయారీ పద్ధతి:
ముందుగా ఒక కప్పు ఉసిరి కాయలను తీసుకోని, వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్‌పై బౌల్ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉసిరికాయ ముక్కలను వేసి.. 12 నిమిషాల పాటు ఉంచి, తర్వాత వడకట్టుకుని బాటిల్‌లో నింపుకునే ముందు ఆ ఆయిల్‌లో విటమిన్ సి ట్యాబ్లెట్స్‌లో ఉన్న నూనెను తీసి అందులో వేసి బాగా మిక్స్ చేసి.. బాటిల్‌లో నింపండి. అంతే కొబ్బరి, ఉసిరి ఆయిల్ రెడీ అయిపోయినట్లే. ఈ నూనె ప్రతి రోజు మీ జుట్టుకు అప్లై చేసి నీటితో శుభ్రం చేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే హెయిర్ లాస్ సమస్య కూడా తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
Read more: