Stunning dance : ఆ యువతి డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింట వైరలవుతోన్న వీడియో!

డ్యాన్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆకట్టుకునే గొప్ప కళ. ఇందులో చేసేవారు ఎంత ఉత్సాహంగా ఉంటారో.. చూసేవారు కూడా అంతకంటే రెట్టింపు క్యూరియాసిటీ ప్రదర్శిస్తూ ప్రోత్సహిస్తారు.

Update: 2024-08-28 13:45 GMT

దిశ, ఫీచర్స్ : డ్యాన్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆకట్టుకునే గొప్ప కళ. ఇందులో చేసేవారు ఎంత ఉత్సాహంగా ఉంటారో.. చూసేవారు కూడా అంతకంటే రెట్టింపు క్యూరియాసిటీ ప్రదర్శిస్తూ ప్రోత్సహిస్తారు. అందుకే ఈ రోజుల్లో పలువురు డ్యాన్సర్లు తమ ట్యాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ ఫేమస్ అవుతున్నారు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రముఖ అమెరిక్ రాపర్, సింగర్ మేగాన్ థీ స్టాలియన్ పాడిన ‘మముషి’ పాట అయితే ప్రపంచ యువతనే ఉర్రూతలూగిస్తోంది. చాలామంది యువతీ యువకులు ఈ పాటకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రజెంట్ అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ముంబైకి చెందిన అనుదిత అనే యువతి ‘మముషి’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. మోడర్న్ డ్రెస్‌లో సరికొత్త లుక్‌లో ఆమె వేసిన స్టెప్పులు యువతను, ప్రజలను బాగా ఆకట్టుకుంటుండగా.. మతిపోగొట్టే డ్యాన్స్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఐయామ్ ఏ స్టార్’ అనే క్యాప్షన్‌తో anuditapaul-di అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాగా ఎంతో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసిన అనుదిత కేవలం టాలెంటెడ్ డ్యాన్సర్ మాత్రమే కాదు, ఆమె గొప్ప జిమ్నాస్ట్ కూడా. ‘లిటిల్ మాస్టర్స్’ సీజన్ 3లో కూడా టాప్ 8 కంటెస్టెంట్‌గా నిలిచినట్లు, ‘డ్యాన్స్ ఐకాన్’లో టాప్ 9 ర్యాంక్ సాధించినట్లు వైరల్ వీడియో ద్వారా తెలుస్తుండగా.. వెరీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Video Credits to anuditapaul-di Insta Id 


Similar News