ట్రాఫిక్ సౌండ్‌తో అనారోగ్యం.. ఆందోళనతో ముడిపడిన శబ్దాలు..
ఉదయం పూట పక్షుల కిలకిలరావాలు వినడం ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఉదయం పూట పక్షుల కిలకిలరావాలు వినడం ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా?ఈ విషయంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. పక్షి శబ్దాలు వినడం ద్వారా మానవులు ఒత్తిడి, ఆందోళనను అధిగమిస్తున్నారని స్పష్టం చేశారు. పట్టణ ట్రాఫిక్ శబ్దం, సహజ పక్షి గానం మనుషుల అభిజ్ఞా, భావోద్వేగ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని రీసెర్చ్ చేసిన జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
నేచర్ పోర్ట్‌ఫోలియో మ్యాగజైన్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సంబంధిత సౌండ్‌స్కేప్‌లలో వివిధ సాధారణ ట్రాఫిక్ శబ్దాలు లేదా పక్షి జాతుల పాటల సంఖ్యను మార్చడం ద్వారా తక్కువ మరియు అధిక సౌండ్‌స్కేప్ వైవిధ్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం శాస్త్రవేత్తల మరొక లక్ష్యం. కాగా పరిశోధకులు నిర్వహించిన ఆన్‌లైన్ ప్రయోగంలో 295 మంది పాల్గొనగా.. రాండమ్‌గా ఎంచుకున్న కొందరిపై ఆరు నిమిషాల పాటు ట్రాఫిక్ నాయిస్ తక్కువ, ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ, బర్డ్‌సాంగ్ తక్కువ మరియు బర్డ్‌సాంగ్ హై డైవర్సిటీ సౌండ్‌స్కేప్‌లను ప్రయోగించారు. ఈ క్రమంలో నాయిస్ ఎక్స్‌పోజ్ ముందు మరియు తర్వాత.. డిజిట్-స్పాన్, డ్యూయల్ ఎన్-బ్యాక్ టాస్క్‌లు, విచారం, ఆందోళన, మతిస్థిమితానికి సంబంధించిన సర్వేలను పూర్తి చేశారు.
ప్రపంచం వేగంగా పట్టణీకరణ చెందుతుండగా ప్రజలు నివసించే పర్యావరణం కూడా వేగంగా మారుతుందని నివేదిక చెబుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70% మంది నగరాల్లో నివసిస్తున్నారని అంచనా వేయబడగా.. యూరప్ వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఈ శాతాన్ని మించిపోయాయి. పట్టణీకరణ అధ్వాన్నమైన మానసిక ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉన్నందున, పట్టణ వాతావరణం మానవుల శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ సాంప్రదాయ మానసిక పరిశోధన సాధారణంగా మానవ శ్రేయస్సు, జ్ఞానంపై ఎన్విరాన్మెంటల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇంపాక్ట్‌ను తక్కువగా అంచనా వేస్తుంది.
ఇవి కూడా చదవండి :
మనుషుల్లో న్యూట్రిషనల్ విజ్డమ్ : తెలియకుండానే పోషకాహార ఎంపిక