గుండె జబ్బులకు కారణమవుతున్న సుగంధ ద్రవ్యాలు..

కొన్నిరకాలలో లెవల్ మెటల్స్‌కు గురికావడంవల్ల గుండెపోటు, స్ట్రోక్, దమనుల వాపు వంటి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ న్యూ సైంటిఫిక్ స్టేట్‌మెంట్ పేర్కొంది.

Update: 2023-06-17 10:57 GMT

దిశ, ఫీచర్స్: కొన్నిరకాలలో లెవల్ మెటల్స్‌కు గురికావడంవల్ల గుండెపోటు, స్ట్రోక్, దమనుల వాపు వంటి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ న్యూ సైంటిఫిక్ స్టేట్‌మెంట్ పేర్కొంది. సాధారణంగా ఉపయోగించే గృహోపకరణాలు, గాలి, నీరు, నేల, ఆహారం ద్వారా బహిర్గతమయ్యే తక్కువ స్థాయి సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌ల ప్రభావం వ్యక్తులపై దీర్ఘకాలం కొనసాగితే గుండె జబ్బులతోపాటు అకాల మరణాలకు దారితీస్తుందని వరల్డ్ ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కూడా పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ లోహాలు జీవ సంబంధమైన విధులకు ఆటంకం కలిగిస్తాయని, శరీరంలోని ఎముకల్లో, అవయవాలలో నిలిచి పోతాయని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు, కార్డియాలజిస్టు గెర్వాసియో పేర్కొ్న్నాడు.

పెయింట్, పొగాకు ఉత్పత్తులు, సెకండ్ హ్యాండ్ పొగ, కలుషితమైన ఆహారాలు, నీటి పైపులు, సుగంధ ద్రవ్యాలు, కాస్మోటిక్స్, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఉద్గారాలు ఈ లోహాలకు నెలవుగా ఉంటున్నాయి. అంతేగాక పిగ్మెంట్లు, ప్లాస్టిక్, సిరామిక్స్, గాజుతో తయారైన వస్తువులు, నిర్మాణ ఉత్పత్తులలోనూ లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్‌లు అధికంగా ఉంటాయి. పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ఎరువుల్లో కాడ్మియంతో కూడిన ఫాస్ఫేట్ రాక్‌‌ను ఉపయోగిస్తారు. వీటిని పంటలకు వేయడం వల్ల కూరగాయలు, ఆకు పచ్చని మొక్కలు కలుషితం అవుతాయి. ఇక ఆర్సెనిక్ ప్రధానంగా భూగర్భ జలాల ద్వారా ఫుడ్ సర్కిల్‌లో చేరుతుంది. ప్రధాన రహదారులు, పారిశ్రామిక వనరులు, ప్రమాదకర వ్యర్థ ప్రదేశాలకు దగ్గరగా నివసించే వారు దీని ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్త సమస్యగా మారుతోందని కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అనా నవాస్-ఏసియన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: ఆగిన గుండె ఐదు గంటల తరువాత కొట్టుకుంది


Similar News