Stress management: ఒత్తిడిని జయించే అద్భుత సూత్రం.. 24 గంటలు.. 8.8.8 నియమం!

Stress management: ఒత్తిడిని జయించే అద్భుత సూత్రం.. 24 గంటలు.. 8.8.8 నియమం!

Update: 2024-10-08 09:17 GMT

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ఎంతో మంది రకరకాల సమస్యలతో, మానసిక ఒత్తిళ్లతో సమమతం అవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనసును కకలా వికలం చేసే ఆలోచన ఒక్కసారైనా వచ్చిపోతుందని చెప్పేవారు చాలామందే ఉంటారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఆలోచనలైతే పర్లేదు. కానీ కొన్ని మనసులో నాటుకుపోతాయి. నిరంతరం వేధిస్తూ కృంగదీస్తాయి. ప్రశాంతంగా ఉన్నవాళ్లను సైతం మానసిక ఒత్తిడిలో ముంచెత్తుతాయి. అయితే వాటి తాలూకు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మార్గాలున్నాయి. అలాంటి వాటిలో రూల్ 8.8.8 కూడా ఒకటి అంటున్నారు మానసిక నిపుణులు. ఇంతకీ దీని అర్థం ఏమిటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం.

ఒడిదుడుకుల జీవితంలో.. ఒత్తిడి అనే సుడిగుండంలో ఒక్కసారైనా చిక్కుకోకుండా ఎవరూ బయటపడరు. లైఫ్‌లో అది కూడా ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే దానిని ఎలా నిర్వహించాలో, ఎలా తిప్పికొట్టాలో తెలియకపోవడమే ఇక్కడ సమస్యగా మారుతుంది అంటున్నారు. చదువు, ఉద్యోగం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఏదో ఒకస్థాయిలో ఒత్తిడికి గురిచేస్తాయి. కొన్నిసార్లు అవి అధికమైతేనో, వాటికి తోడు ఇంకేమైనా సమస్యలు వచ్చిపడితేనో ఒత్తిడి రెట్టింపు అవుతుంది. నిద్రలేమి కూడా వెంటాడవచ్చు.

సమయపాలన ముఖ్యం

అయితే ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేసే మహమ్మారిలా అనిపించవచ్చు. కానీ పరిష్కారం లేని సమస్య మాత్రం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనిదైతే అస్సలు కాదు. కాకపోతే మీరు కాస్త మారాలి. ఆ మార్పే సమయ పాలన. మీ దినచర్య విషయంలో ఒక టైమ్ సెట్ చేసుకొని దానిని జయిస్తూ పోవడం చాలా ఈజీ అంటున్నారు నిపుణులు. అందుకు 8.8.8 సూత్రం చక్కగా ఉపయోగ పడుతుందని పేర్కొంటున్నారు.

ఎలా వర్క్ చేస్తుంది?

పర్సల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదురయ్యే ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో 8.8.8 ఒక గొప్ప ఆయుధంలా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఇదిక ప్లానింగ్ టైమ్ టేబుల్ అన్న మాట. రోజుకు 24 గంటలు ఉంటుంది కాబట్టి మీరు ఒత్తిడిని జయించే క్రమంలో దానిని 8 గంటల చొప్పున మూడు భాగాలు విభజించుకోవాలి. అంటే 8 గంటలు మీ ప్రొఫెషనల్ లైఫ్‌కు, మరో 8 గంటలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గడపడానికి, ఇంకో ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడానికి సమయం కేటాయించాలి. దీంతో మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటివి ఇబ్బంది పెట్టవు. ఒకవేళ అవి ఎదురైనా ఎదుర్కొనే సామర్థ్యం మీలో డెవలప్ అవుతుంది అంటున్నారు మానసిక నిపుణులు.

బెనిఫిట్స్ ఏమిటి?

ఏ విషయంలోనైనా ఒక క్లారిటీ ఉన్నప్పుడు పరిష్కారం సులువు అవుతుంది. అలాగే ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో సమయాన్ని విభజించి అన్వయించుకునే 8.8.8 సూత్రం కూడా వర్క్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిద్రలేమితో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. చేస్తున్న పనిలో నాణ్యత ఉండదు. అలాగే పని ఎక్కువైతే ఒత్తిడి పెరుగి నిద్రలేమి సమస్య రావచ్చు. కాబట్టి 24 గంటల సమయాన్ని 8 గంటల చొప్పున డివైడ్ చేసుకొని దేని సమయం దానికి కేటాయిస్తే ఈ గందరగోళానికి తావుండదు. ఒక వైపు పనిలో నాణ్యత పెరుగుతుంది. మరో వైపు చక్కటి నిద్రతో ప్రశాంతత చేకూరుతుంది. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం వల్ల కమ్యూనికేషన్ బలపడుతుంది. అది ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆనందానికి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు.

అందరికీ వస్తుందా?

సమయాన్ని విభజించుకొని, ఒత్తిడిని జయించడానికి 8.8.8 రూల్ ఒక చక్కటి మార్గం కావచ్చు. అయితే అందరి విషయంలో అలాగే పనిచేస్తుందా? దాదాపు చేస్తుందనే అంటున్నారు నిపుణులు. అలాగే రాత్రింబవళ్లు లేదా సమయానుకూలంగా పనిగంటలు లేని వృత్తుల్లో ఉన్నవారికి వర్తించకపోవచ్చు కూడా. ఎందుకంటే అక్కడ పనివేళలు ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే కచ్చితంగా..8.8.8 నియమమే కాకుండా దీనిని గమనంలో ఉంచుకొని, ఎవరికి వారు కూడా తమ పరిస్థితిని, పనిని బట్టి సమయాన్ని విభజించుకోవడం ద్వారా కొత్త రూల్ అనుసరించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి అది మీకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఒత్తిడిని జయిస్తే చాలు. 


Similar News