ఒంటరిగా ఉన్నారా? తప్పకుండా ఇది చదవాల్సిందే..

సింగిల్‌గా ఉండటం కొన్నిసార్లు మిస్టరీలా అనిపించవచ్చు. ప్రత్యేకించి రొమాంటిక్ రిలేషన్ కోసం ఆరాటపడుతున్నప్పుడు.. ఎక్కడో కొంచెం బాధగానే ఉంటుంది. దరిద్రం

Update: 2024-05-13 13:49 GMT

దిశ, ఫీచర్స్: సింగిల్‌గా ఉండటం కొన్నిసార్లు మిస్టరీలా అనిపించవచ్చు. ప్రత్యేకించి రొమాంటిక్ రిలేషన్ కోసం ఆరాటపడుతున్నప్పుడు.. ఎక్కడో కొంచెం బాధగానే ఉంటుంది. దరిద్రం వెంటాడుతున్న భావన కలుగుతుంది. నిజానికి భాగస్వామిని కనుగొనడం అనేది లోతైన వ్యక్తిగత ప్రయాణం కాగా అసలు మీరు ఇంకా ఎందుకు ఒంటరిగా ఉన్నారో ఆలోచించాలని సూచిస్తున్న నిపుణులు.. కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు.

పాస్ట్ రిలేషన్ షిప్స్

మీరు గత సంబంధాల నుండి పూర్తిగా కోలుకోకపోవడం ఇప్పటికీ ఒంటరిగా ఉండేందుకు కారణం కావచ్చు. పాస్ట్ బ్రేకప్స్ మీకు భయాలు కలిగించవచ్చు. మరో రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యేందుకు ఆలోచించేలా చేయవచ్చు. కొత్తగా కనెక్ట్ అవడానికి ఆందోళన చెందేలా చేయొచ్చు. అలాంటప్పుడు మీ ఎమోషన్స్ ప్రాసెస్ చేయడానికి టైం తీసుకోండి. పూర్తిగా కోలుకున్నాకే మరొకరితే బంధాన్ని ఏర్పరుచుకోండి.

కెరీర్‌పై కాన్సంట్రేషన్

మీరు స్టిల్ సింగిల్‌గా ఉండేందుకు కారణం కెరీర్, లక్ష్యాలపై దృష్టి పెట్టడం కావచ్చు. మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి.. డేటింగ్ గురించి ఆలోచించడం మానేసి ఉండొచ్చు. ఆశయం మెచ్చుకోదగినది అయినప్పటికీ.. బ్యాలెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. మీ జీవితంలో శృంగారానికి చోటు కల్పించడం చాలా అవసరం. అందుకే కొత్త వ్యక్తులను కలవడానికి లేదా డేటింగ్ యాప్‌ల కోసం సమయాన్ని కేటాయించడం బెటర్.

అంచనాలు

ప్రేమ, పెళ్లి, సంబంధాలపై మీ అభిప్రాయం పాజిటివ్‌గా లేకపోవచ్చు. దీనివల్ల భాగస్వామిని పొందేందుకు ట్రై చేయకపోవచ్చు. ఇతరులతో పోల్చుకోకుండా వాస్తవంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ విషయంలో కూడా లాగే జరుగుతుందనే బాధ నుంచి బయటకు వచ్చేయండి. అప్పుడే మీకు సరిపోయే భాగస్వామితో ఆరోగ్యం సుఖమయంగా ఉంటుంది. ఓపెన్ మైండెడ్, ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ మీకు మేలు చేయవచ్చు.

రిజెక్ట్ చేస్తారనే భయం

కొందరు రిజెక్షన్ భయంతో కూడా ప్రపోజ్ చేసేందుకు వెనుకడుగు వేస్తారు. నచ్చిన వ్యక్తిని పొందడంలో ఫెయిల్ అవుతారు. అలా కాకుండా మనస్పూర్తిగా మీ మనసులోని ఫీలింగ్స్ చెప్పాలని సూచిస్తున్నారు నిపుణులు. రిజెక్షన్ అనేది నేచురల్ ప్రాసెస్ కాబట్టి మిమ్మల్ని మీరు వచ్చే రిజల్ట్‌కు సెట్ చేసుకుని ముందుకు సాగండి. పాజిటివ్ లేదా నెగెటివ్ రియాక్షన్ రెండింటినీ యాక్సెప్ట్ చేయండి.

ట్రై చేస్తున్నారా?

కొందరు ప్రయత్నించకుండానే ఫలితాన్ని ఆశిస్తారు. అలా చేయడం ఎంత వరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. సోషల్ అప్పియరెన్స్, చాటింగ్, మీటింగ్ చేస్తూ ఉండండి. రోటీన్ లైఫ్ స్టైల్‌లో కాకుండా కొత్త వాళ్ళను కలవండి. సోషల్ సర్కిల్ ఎక్స్ పాండ్ చేసుకోండి. ఆన్ లైన్ డేటింగ్‌లో యాక్టీవ్‌గా ఉండండి.


Similar News