మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే ఎందుకు ఎక్కువగా ఉంటది...?
మనం పీల్చుకునే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్, మిథేన్ లాంటి... Special Story
దిశ, వెబ్ డెస్క్: మనం పీల్చుకునే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్, మిథేన్ లాంటి మరికొన్ని రకాల వాయువులు కూడా చాలా స్వల్ప పరిమాణంలో ఉంటాయి. అయితే, ఇన్ని వాయువులున్నప్పటికీ కేవలం ఆక్సిజన్ కే అయస్కాంతత్వం ఉంటుంది. మనం ముక్కు ద్వారా పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల్లోని పలుచని పొరల్లోకి చొచ్చుకుని వెళ్తుంది. ఆ పొరల్లో రక్తం ప్రవహించే రక్తకేశనాళికలు ఉంటాయి. రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ జీవాణువులకు కూడా అయస్కాంతత్వం ఉంది. అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. కాబట్టి హీమోగ్లోబిన్ కి, ఆక్సిజన్ అనుసంధానం అవుతుంది. ఆక్సిజన్ ను బంధించుకున్న హీమోగ్లోబిన్ ను ఆక్సీహీమోగ్లోబిన్ అంటారు. మంచి రక్తం అంటే ఇదే. గాలిలోని మిగతా వాయువులకు అయస్కాంతత్వం లేకపోవడం వల్ల అవి వెళ్లినదారిలోనే ముక్కులోంచి మళ్లీ బయటకి వచ్చేస్తాయి.
ఇవి కూడా చదవండి :