ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే, పండుగరోజు మీకో గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ సంస్థలు తమ కస్టమర్లను ఆకర్శింపజేసేందుకు...Special news for Food Order Customers
దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ సంస్థలు కస్టమర్లను ఆకర్శింపజేసేందుకు, అదేవిధంగా వారికి మరిన్ని సేవలు అందజేసేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకొస్తుంటాయి. అప్పుడప్పుడు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. అయితే, తాజాగో జొమాటో ఓ సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చేందుకు సన్నద్దమవుతోంది. అదేమిటంటే.. కస్టమర్లు దేశంలోని ఏ సిటీ నుంచైనా తమకు నచ్చిన ప్రత్యేక వంటకాన్ని ఆర్డర్ చేసుకుంటే 24 గంటల్లో ఆ వంటకాన్ని కస్టమర్ కు అందించనున్నారంట. జొమాటో ఇంటర్ సిటీ లెజెండ్స్ పేరుతో ఈ సేవలను ఆరంభించనుందంట. అయితే, ఒక్కోసారి 24 గంటల సమయం కూడా మించే అవకాశముంటదంట. ప్రస్తుతమైతే పలు ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తున్నారంట.