ఇక వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు.. యాంటీ ఏజింగ్ ప్లాంట్‌ను కనుగొన్న సైంటిస్టులు

వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో సహజమే అయినప్పటికీ ఇది అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. యవ్వనంలో ఉన్న ఉత్సాహం, ఉల్లాసం, అందం ఏజ్‌బార్ అయిన తర్వాత ఉండదు. ముఖంలో ముడతలు ఏర్పడతాయి.

Update: 2024-01-20 09:08 GMT

దిశ, ఫీచర్స్ : వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో సహజమే అయినప్పటికీ ఇది అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. యవ్వనంలో ఉన్న ఉత్సాహం, ఉల్లాసం, అందం ఏజ్‌బార్ అయిన తర్వాత ఉండదు. ముఖంలో ముడతలు ఏర్పడతాయి. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. బీపీ, షుగర్, పలు ఇతర వ్యాధులు దాడిచేస్తుంటాయి. అయితే అసలు శరీరానికి వృద్ధాప్యమే రాకపోతే ! ఎల్లప్పుడు నిత్య యవ్వనంగానే కనిపిస్తే.. వినడానికే ఆశ్చర్యంగా, ఆనందగా, ఉత్సుకతగా ఉంది కదూ.. కానీ భవిష్యత్తులో మీ ఉత్సుకత నిజం కావచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్ (యుఆర్‌సి) సైంటిస్టులు. ఎందుకంటే మానవ వృద్ధాప్య ప్రక్రియను హ్యాక్ చేయాలనే అన్వేషణలో వారు అరబిడోప్సిస్, అలాగే థేల్ క్రెస్ అనే కొత్త రకం మొక్కలను గుర్తించారు. వీటిలో యాంటీ ఏజింగ్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయగలిగే సర్‌ప్రైజింగ్, కణాలు, ప్రోటీన్స్ ఉన్నాయని కనుగొన్నారు. ఇవి గోల్గి సెల్స్‌ను నియంత్రించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి.

గొల్గి బాడీ లేదా గొల్గి సెల్ అనేది శరీరంలోని ప్రొటీన్లు, లిపిడ్ అణువుల నిర్వహణలో కీ రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా కణం నుంచి కణాన్ని కనెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతాయి. మొదట వీటిని గుర్తించిన సైంటిస్టు కామిల్లో గొల్గి పేరు మీద వీటిని గొల్గి సెల్స్ అని పిలుస్తారు. నిజానికి గొల్గి శరీరంలో పేర్చబడిన పొరల శ్రేణిగా కనిపిస్తుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌లోని బోటనీ, ప్లాంట్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో పరిశోధకుడైన హీసంగ్ చోయ్ ఆధ్వర్యంలో పరిశోధకులు ఇప్పుడు అరబిడోప్సిస్, అలాగే థేల్ క్రెస్ మొక్కల కణాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయని, గొల్గి డెత్ సెల్స్‌ను అడ్డుకుంటాయని కనుగొన్నారు. ఫలితంగా అవి శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవడంలో ఉపయోపగ పడతాయని చెప్తున్నారు. మరిన్ని ప్రయోగాల తర్వాత మానవులకు వర్తింపజేసే విషయాలపై క్లారిటీ రానుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.


Similar News