వేసవిలో వాంతులు, విరేచనాలు.. ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్

క్లైమేట్ క్రైసిస్‌ కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేయడంతో జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.

Update: 2024-04-06 04:47 GMT

దిశ, ఫీచర్స్: క్లైమేట్ క్రైసిస్‌ కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేయడంతో జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకొంచెం టెంపరేచర్ పెరిగినా వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలతో హాస్పిటల్ మెట్లు ఎక్కే అవకాశముంది. అలా జరగకుండా మండే ఎండల్లోనూ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు పలు సూచనలు అందిస్తున్నారు నిపుణులు. 

1. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో అజీర్ణం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి. బయట లభించే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ముట్టుకోకపోవడమే మంచిది. ఇక మిగిలిన ఆహారాన్ని తర్వాతి రోజు తినడం కూడా అనారోగ్యానికి దారితీస్తుంది.

2. బలమైన వేడి గాలుల కారణంగా జలుబు, దగ్గు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాల సమస్యలు వస్తాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించాలి.

3. బాడీని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ పానీయాలు తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. తరుచూ యూరిన్ వెళ్లాల్సి వస్తుందనే అపోహతో తక్కువ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు.

4. మండే ఎండల్లో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. కానీ ఒకవేళ వెళ్తే సన్ గ్లాసెస్ యూజ్ చేయండి.


Similar News